Share News

హర హర మహాదేవ..శంభో శంకర

ABN , Publish Date - Nov 19 , 2024 | 12:09 AM

కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి.

హర హర మహాదేవ..శంభో శంకర
చెన్నూరు కాశీవిశ్వేశ్వరాలయంలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు

కడప కల్చరల్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. హర హర మహాదేవ.. శంభో శంకర అంటూ శివాలయాలన్నీ భక్తుల శివనామస్మరణతో మార్మో గాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు కుటుంబ సమేతంగా జనం హాజరయ్యారు. కార్తీకదీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కడప నగరంలోని మృత్యుంజయకుంటలో వె లసిన మృత్యుంజయేశ్వరస్వామి దేవాలయం, నబీకోట శివాలయం, మోచంపేట శివాలయం, దేవునికడప శివాలయం, గడ్డిబజారులో వెలసిన బాలాజీ ఆలయం భక్తులతో కిటకిటలాడాయి.

కార్తీకం.. పరమపవిత్రం

చెన్నూరు: కార్తీక మాసం పరమపవిత్రం. ఈ మాసంలో చేసే ప్రతి పూజ పాపాలను హరించి పుణ్యం ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. మూడోసోమవారం సందర్భంగా చెన్నూరు మల్లేశ్వరాయలం, దక్షిణ కాశిగా పేరొందిన శివాలపల్లె కాశీవిశ్వేశ్వరాలయం, ఉప్పరపల్లె నాగలింగేశ్వరాలయం, నాగేశ్వరాలయాల్లో పూజలు చేశారు.

వల్లూరు: పుష్పగిరి క్షేత్రంలో కామాక్షి సమేత వైద్యనాఽధేశ్వర, రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ సంతాన మల్లేశ్వరులను భక్తులు దర్శించుకున్నారు. భవానీశంకర ఆలయంలో రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు చేశారు. అలాగే భవానీ అమ్మవారిని పండ్లతో సుందరంగా అలంకరించారు. సాయంత్రం మహామంగళహారతి చేపట్టారు. కమలాపురం రూరల్‌:చదిపిరాళ్ల శివాలయం శివనామస్మరణలతో మార్మోగింది.

ఘనంగా శివపూజ

కడప కల్చరల్‌: బాలాజీనగర్‌ కీర్తి ఎనక్లేవ్‌లో హిమలింగానికి శివపూజ ఘనంగా నిర్వహించారు. ఏపీఎ్‌సఆర్టీసీ అద్దె బ స్సుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాలగిరి భాస్కర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

శైవక్షేత్రాల్లో కార్తీక శోభ

పులివెందుల టౌన, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఓం నమశ్శివాయ అంటూ భక్తుల నామస్మరణతో శివాలయాలు మారుమోగాయి. ఎర్రంరెడ్డిపల్లె గ్రామంలో వెలసిన హరినారాయుణస్వామి వారి ఆలయంలో జన జాతర తలపిస్తూ ప్రత్యేక దీ పోత్సవాలు జరిగాయి. ఆలయ అర్చకులు హరినారాయణస్వామికి ఏకరుద్రాభిషేకాలు, బిల్వార్చనలు పూజలు అందుకున్నా రు. అలాగే పులివెందుల పట్టణంలోని పలు ఆలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది.

Updated Date - Nov 19 , 2024 | 12:09 AM