Share News

గాలివానతో అపార నష్టం

ABN , Publish Date - May 08 , 2024 | 12:01 AM

తంబళ్లపల్లె మండల కేంద్రంతో పాటు పలు గ్రామా ల్లో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సానికి అపార నష్టం సం భవించింది.

గాలివానతో అపార నష్టం
తంబళ్లపల్లెలో గాలివానకు దెబ్బతిన్న అరటితోట

తంబళ్లపల్లె, మే 7: తంబళ్లపల్లె మండల కేంద్రంతో పాటు పలు గ్రామా ల్లో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సానికి అపార నష్టం సం భవించింది. తంబళ్లపల్లెలో అరటి, తమలపాకు తదితర పంటలు దెబ్బ తినగా..చెట్లు విరిగి పడి 18 విద్యుత స్తంభాలు నేలకొరిగాయి. దీంతో మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యుత సిబ్బంది తీవ్రంగా శ్రమిం చి మంగళవారం మధ్యాహ్ననానికి పూర్తి స్థాయిలో విద్యుత సరఫరా పునరుద్ధరించారు. గాలివాన ప్రభావానికి ఆరు 11 కేవీ, 12 ఎల్‌టి కరెంటు స్తంభాలు నెలకొరగ్గా, మూడు వ్యవసాయ ట్రాన్సఫార్మర్లు దెబ్బతిన్నట్లు ట్రాన్సకో ఏఈ శేషుకుమార్‌ తెలిపారు. దీంతో అంచనా ప్రకారం సుమారు రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లింటుందని ఏఈ తెలిపారు. తంబళ్లపల్లెకు చెందిన రైతు ఆకులరెడ్డప్ప ఒక ఎకరాలో సాగు చేసిన అరటితోట ప్రస్తుతం కోత దశలో ఉండగా గాలివాన ధాటి కి అరటి చెట్లు విరిగిపోయి పంట మొత్తం దెబ్బతిందని సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. అదేవిధంగా బోడికిందపల్లెకు చెందిన దామోదర్‌రెడ్డి రేకుల షెడ్డు దెబ్బతినడంతో అందులో నిల్వ చేసిన సుమారు వంద బస్తాలు వేరుశనక్కాయలు వర్షానికి తడిచిపోయినట్లు రైతు తెలిపాడు. అదేవిధంగా మండలంలోని పలు గ్రామాల్లో మామిడి తోటల్లో మామిడి కాయలు రాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గాలివానతో విద్యుత సరఫరాకు అంతరాయం

మదనపల్లె టౌన, మే 7: మదనపల్లె పట్టణంతో పాటు, మండలంలో సోమవారం రాత్రి కురిసిన వర్షంతో పాటు వీచిన గాలులకు పలుచోట్ల చెట్లు విరిగి విద్యుత తీగలపై పడి స్తంభాలు నేలవాలాయి. దీంతో విద్యుత సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి ఆవరణలోని చెట్టు గాలి బీభత్సానికి పక్కనే ఉన్న విద్యుత తీగలపై పడి రెండు విద్యుత స్తంభాలు విరిగి నేలకూలాయి. ఆ సమయంలో అక్కడ రోగులు, ప్రజలు ఎవ్వరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. అర్ధరాత్రి నుంచి ప్రభుత్వాస్పత్రిలో విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం ఆస్పత్రిలోని విద్యుత సిబ్బంది మేల్‌ వార్డు, పేవార్డు, బ్లడ్‌బ్యాంకు, ఫిమేల్‌ వార్డులకు విద్యుత సరఫరా పునరుద్ధరించారు. కానీ అత్యవసర విభాగం, ల్యాబ్‌ లు, ఎక్స్‌రే విభాగం, అడ్మినిస్ట్రేటివ్‌ విభాగంలో సాయం త్రం వరకు విద్యుత సరఫరా లేదు. ఎట్టకేలకు ఆస్పత్రి అధికారులు స్థానిక ట్రాన్సకో అధికారులకు లేఖ రాయడంతో ట్రాన్సకో సిబ్బంది వచ్చి విరిగిపోయిన రెండు విద్యుత స్తంభాలను తొలగించి విద్యుత సరఫరా పునరుద్ధరించారు. కాగా రెండు గంటల పాటు కురిసిన వర్షంతో పలుచోట్ల వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలను ముంచేసాయి. స్థానిక సీటీఎం రోడ్డులోని ఎస్టేట్‌ వద్ద మురుగు కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో వర్షపు నీరు కాలువలో వెళ్లలేక పక్కనే ఉన్న అండర్‌గ్రౌండ్‌ దుకాణాల్లోకి వెళ్లి నష్టం వాటిల్లింది. ఎస్టేట్‌ ప్రాంతంలో ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో పది దుకాణా లు అండర్‌గ్రౌండ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో పైతట్టు ప్రాంతం నుంచి వర్షపు నీరు కాలువలో వెళ్లలేక పక్కనే అండర్‌గ్రౌండ్‌ దుకాణాల్లోకి వెళ్లి నిండిపోయాయి. దీంతో దుకాణాల నిర్వాహకులు మోటార్‌ పెట్టి దుకాణాల్లో నిలిచిపోయిన నీటిని బయటకు కొడుతున్నారు. దీంతో దుకాణదారులకు భారీగా నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.

Updated Date - May 08 , 2024 | 12:01 AM