Share News

TDP Vs YSRCP: రాచమల్లుకు ఎదురుగాలి.. వరదకు కలిసొచ్చేవి ఇవే..!

ABN , Publish Date - May 07 , 2024 | 11:18 PM

‘వరదరాజుల రెడ్డి ధాటికి ఫ్యాన్‌ గల్లంతయ్యేలాగుంది. ఓ వైపున వైసీపీకి పెరిగిన అసమ్మతి, ఇసుక దందా, భూ ఆక్ర మణలు, రెండో ఎమ్మెల్యేగా పేరుగాంచిన బావమర్దిని నిలువ రించకపోవడంతో స్వపక్షంలోనే అసమ్మతి తయారైంది. ఫలి తంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి ఎదురీదుతున్నారు. శిష్యరికం పొందిన రాచమల్లుకు అన్ని మెలకువలు నేర్పిన గురువు వరదరాజులరెడ్డి తన వద్ద మిగి లిఉన్న మెలకువలను పాటిస్తూ రాచమల్లును పరిగెత్తిస్తున్నా రు. ఎట్టకేలకు ప్రొద్దుటూరులో మళ్లీ టీడీపీ జెండాను ఎగుర వేసేందుకు వరదరాజులరెడ్డి అన్నీ సిద్ధం చేసుకున్నారు. వివరాల్లోకెళితే.....

TDP Vs YSRCP: రాచమల్లుకు ఎదురుగాలి.. వరదకు కలిసొచ్చేవి ఇవే..!

  • ప్రొద్దుటూరులో రాచమల్లుకు ఎదురుగాలి

  • సొంత నేతలు క్యాడర్‌లోనూ అసమ్మతి

  • మూడో పర్యాయం పొంచి వున్న ఓటమి ముప్పు

  • ప్రజాబలంతో గెలుపు దిశగా వరదరాజులరెడ్డి

  • ప్రొద్దుటూరులో మళ్లీ ఎగురనున్న టీడీపీ జెండా

‘వరదరాజుల రెడ్డి ధాటికి ఫ్యాన్‌ గల్లంతయ్యేలాగుంది. ఓ వైపున వైసీపీకి పెరిగిన అసమ్మతి, ఇసుక దందా, భూ ఆక్ర మణలు, రెండో ఎమ్మెల్యేగా పేరుగాంచిన బావమర్దిని నిలువ రించకపోవడంతో స్వపక్షంలోనే అసమ్మతి తయారైంది. ఫలి తంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి ఎదురీదుతున్నారు. శిష్యరికం పొందిన రాచమల్లుకు అన్ని మెలకువలు నేర్పిన గురువు వరదరాజులరెడ్డి తన వద్ద మిగి లిఉన్న మెలకువలను పాటిస్తూ రాచమల్లును పరిగెత్తిస్తున్నా రు. ఎట్టకేలకు ప్రొద్దుటూరులో మళ్లీ టీడీపీ జెండాను ఎగుర వేసేందుకు వరదరాజులరెడ్డి అన్నీ సిద్ధం చేసుకున్నారు. వివరాల్లోకెళితే..

ప్రొద్దుటూరు,మే 7: రాయలసీమలోనే ప్రొద్దు టూరు నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వుంది. వ్యాపార, వాణిజ్య కేంద్రంగానే కాకా సాహిత్య సాంస్కృతిక రంగాలకు పుట్టినిల్లు. పుట్టపర్తి నారా యణా చార్యులు లాంటి సాహిత్య ఉద్దండులు, రాజన్న కవి లాంటి కవులు నడియాడిన నేల. 1985లో రాయలసీమకు నీళ్ల వాటాలో పరిశ్రమ ల్లో జరిగిన అన్యాయంపై మలితరం నేతల్లో ఇక్కడి నుంచి వినిపించిన తొలిగొంతుక డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డిదే. ‘సీమ’ ఉద్యమానికి కేంద్ర బిందువైన నియోజకవర్గం ప్రొద్దుటూరే. ఇక్కడ డాక్టర్‌ ఎంవీఆర్‌ కార్మిక నేతగా వుంటూనే ఆయన సాగించిన ఫ్యాక్షన్‌ రాజకీయాలు హత్యలు రాష్ట్రం లోనే సంచనం రేకెత్తించాయి. అలనాటి రోజుల్లో పూర్తి గ్రామీణ నేపథ్యం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టిన నంద్యాల వరదరాజులరెడ్డి మొదటి సారి 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఎంవీ రమణారెడ్డిపై స్వల్ప ఆధిక్యంలో ఓటమి చెందారు. తర్వాత రమణారెడ్డి ‘సీమ’ కోసం ఉద్యమించడం టీడీపీ నుంచి బయ టికి వచ్చిన ఎంవీఆర్‌పై 1985లో వరదరాజులరెడ్డి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అది మొదలు వరద రాజులరెడ్డి 2009 వరకు వరుస గా ఐదు సార్లు ఓటమి ఎరుగక అప్రతిహతంగా గెలుస్తూ వచ్చారు. 2009లో జరిగిన ఎన్నికల్లో తన శిష్యుడైన టీడీపీ అభ్యర్థి మల్లెల లింగారెడ్డి చేతిలో వరదరాజులరెడ్డి ఓటమి పాలయ్యారు. వైఎస్‌ఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు జిల్లాలో టీడీపీ గెలిచిన ఏకైక నియోజకవర్గం ప్రొద్దుటూరు. కాంగ్రెస్‌లో ఉన్న వరదరాజులరెడ్డి 2014లో వైసీపీలోకి చేరినా జగన్‌ తీరు, స్వభావం నచ్చక వెంటనే మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరాడు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ తుడి చి పెట్టుకు పోవడంతో 2014లో టీడీపీ అభ్యర్థిగా నంద్యాల వరదరాజులరెడ్డి తన శిష్యుడైన రాచ మల్లు శివ ప్రసాద్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యా డు. అప్పటి నుంచే టీడీపీలో కుంపట్లు తయారై బహునాయకత్వం ఏర్పడింది. దీంతో టీడీపీ అధి కారంలో వున్నా అసమ్మతి వర్గాలుతోడవడంతో ఇక్కడ పార్టీ బలహీనపడింది. 2019లో వరద రాజులరెడ్డి టీడీపీ టికెట్టు ఆశించి నా అది మల్లెల లింగారెడ్డికి ఇచ్చారు. టీడీపీలో వున్న అసమ్మతి పోరు, బహునాయకత్వం, రాష్ట్రం లో జగన్‌ గాలితో ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి రాచమల్లు రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Rachamallu-Siva-Prasad-Redd.jpg

రాచమల్లుకు ఎదురుగాలి

ప్రొద్దుటూరులో పదేళ్లుగా ఎమ్మెల్యేగా వున్న రాచ మల్లు తన గురువు వరదరాజులరెడ్డి రికార్డును బద్దలు కొట్టాలనే లక్ష్యంతో వున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడం, రాచమల్లు రెండో సారి ఎమ్మెల్యే అవడంతో తనకు అడ్డూ అదుపు లేదని అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా భూ, ఇసుక దందా, మట్కా, గుట్కా క్రికెట్‌ బెట్టిం గ్‌, నకిలీ నోట్ల ముద్రణ వరకు సాగించి అవినీతి సామ్రాజ్యం నిర్మించారనే తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో వున్నది. పట్టపగలే బీసీ నేత నందం సుబ్బయ్యను అత్యంత కిరాతకంగా నరికి చంపా రు. ఈ కేసులో రాచమల్లు, ఆయన బావమరిది బంగారు రెడ్డి పేర్లులేకుండా పెద్దఎత్తున ఒత్తిళ్లు తెచ్చి ఆఖరికి తమ అనుచరులైన ఐదుగురు ఎస్సీ లను నిందితులుగా చూపించారు. ఈ దారుణ హత్యతో బీసీల్లో వైసీపీ ఎమ్మెల్యే, ఆయన బావమ రిది హత్యా రాజకీయాలపట్ల తీవ్ర వ్యతిరేకత గూ డు కట్టుకుంది. వందల వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదన విచ్చలవిడిగా వెదజల్లి 2024 ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో వున్నారు. కాగా ఈదఫా తనగురువు, రాజకీయ కురువృద్ధు డైన నంద్యాల వరదరాజులరెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో వున్నారు. ఎమ్మెల్యేపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, సొంత పార్టీలో నేతలు క్యాడర్‌ అసంతృప్తితో వుండడం, ముఖ్యనేతలు (సర్పంచు కౌన్సిలర్లు) పార్టీని వీడడం రాచమల్లుకు ప్రొ ద్దు టూరులో ఎదురుగాలి తప్పదన్నట్లుగా వుంది. మూడో సారి హాట్రిక్‌ ఏమో గానీ ఓటమి ముప్పు పొంచివుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Varada-Rajulu-Reddy.jpg

వరదరాజులరెడ్డి ఎమ్మెల్యేగా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండడం, 25 ఏళ్ల వరద పరి పాలన, పదేళ్ల తీరు రాచమల్లు పరిపాలనా తీరును ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. ప్రొద్దుటూ రులో రాచమల్లుకు వ్యతిరేకంగా బహిరంగంగా నోరు విప్పి మాట్లాడలేని భయానక పరిస్థితులు సృష్టించారు. స్వేచ్ఛగా వ్యాపారాలు సాగించలేని పరిస్థితులున్నాయి. దీంతో టీడీపీ టిక్కెట్టు కోసం తీవ్రమైన పోటీ వున్నా వరద నాయకత్వం కోసం ప్రజలు సర్వేల్లో స్వచ్ఛందంగా ఆయనకు మద్ద తు తెలిపారు. వరదరాజులరెడ్డిది పెద్దమనిషి తర హా పాలన కావడం హింసా రాజకీయాలకు తావు లేకుండా శాంతియుత ప్రశాంత ప్రొద్దుటూరు కావాలంటే వరదరాజులరెడ్డితోనే సాధ్యమనే భావ న ప్రజల్లో నెలకొంది..

ఇచ్చిన హమీలు నెరవేర్చకపోవడం

ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి 2019 ఎన్నికల ముందు ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ఏడాదికి రూ.500 కోట్ల వంతున ఐదేళ్లలో రూ.2500 కోట్ల నిధులు తెస్తానన్నాడు. రూ.513 కోట్లతో 13 పను లు మంజూరు చేయించినా ఏ ఒక్కటీ పూర్తికాలే దు. పట్టుపని పదికోట్ల బిల్లులు కూడా మంజూరు చేయించలేక పోయాడు. రెండు సెంట్లలో ఇళ్ళు కటించి లబ్ధిదారుల నుంచి ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా ఒకచేత్తోపట్టా మరోచేత్తో ఇంటిని నిర్మించి తాళం ఇస్తానని హమీ ఇచ్చారు. లేదం టే 2024లో ఈ ముఖంతో ఓట్లడగడానికి రానని, రాజీకాయాలే మానుకుంటానని హామీ ఇచ్చాడు. నేడు అదే ముఖంతో ఓట్లుడగుతున్నాడు.

బీసీలు, ఆర్యవైశ్యులు, ముస్లింలే కీలకం

నియోజకవర్గంలో సామాజిక వర్గాల లెక్కల ప్రకారం బీసీలే అధికంగా వున్నారు. వీరి తర్వాత ఆర్యవైశ్యులు, ముస్లింలు పెద్దసంఖ్యలో వున్నారు. వీరంతా ఎటువైపు నిలిస్తే వారి గెలుపు ఖాయం. ముఖ్యంగా మున్సిపల్‌, అర్బన్‌ ఓటర్లే నిర్ణాయక శక్తులు. ఈ వర్గాల జనాభా కూడా మున్సిపల్‌ పరిధిలోనే ఎక్కువగా వుంటున్నారు. కనుక పార్టీల న్నింటికీ మున్సిపాలిటీ ఓటర్లే కీలకం. జరిగే ఎన్ని కల్లో రాచమల్లు ప్రసాద్‌రెడ్డి డబ్బు బలంపై ఆధా రపడితే వరదరాజుల రెడ్డి ప్రజాబలంతో గెలు పు ధీమాలో వున్నారు. 1952 నుంచి ప్రతి ఎన్నికల్లో బీసీ వర్గాలు టీడీపీకి ఓటు బ్యాంకుగా వుటూ వచ్చాయి. గత రెండు పర్యాయాలు వైసీపీని ఆదరించినా ఈ సారి మాత్రం టీడీపీకి పట్టం కట్టనున్నాయి.

వరదరాజులరెడ్డి బలం

  • అపార రాజకీయ అనుభవం

  • నిజాయితీగా వుండటం

  • అవినీతికి పాల్పడకపోవడం

  • ప్రజలతో సత్సంబంధాలు నెరపడం

  • అన్నివర్గాలను కలిపేసుకు పోవడం

  • కుటుంబం అండగా వుండటం

బలహీనతలు

  • చెప్పిన మాటలు వినడం

  • వ్యతిరేకులపై కేసులు పెట్టించడం

  • మొండితనం ఎక్కువ

రాచమల్లు బలం

  • వేల కోట్లు డబ్బు వుండటం

  • పట్టుదలగా పార్టీకోసం పనిచేయడం

  • కుటుంబ అండ వుండటం

  • అబద్దాలు వండివార్చగల నైపుణ్యం

  • సెకండరీ లీడర్‌ షిప్‌ లేకుండా చేసుకోవడం

బలహీనతలు

  • విచ్ఛల విడిగా డబ్బు సంపాదన

  • కుల పిచ్చి వుండడం

  • హామీలను నెరవేర్చక పోవ డం

  • ఎవరినీ నమ్మక పోవడం

  • పనిచేసినందుకు కార్యకర్తల వద్ద కూడా డబ్బులు గుంజడం

  • కాంట్రాక్టులన్నీ కుటుంబ సభ్యులే చేసుకోవడం

నియోజకవర్గ స్వరూపం

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, ప్రొద్దుటూ రు మండలం, రాజుపాళెం మండలం

  • మొత్తం ఓటర్లు : 2,47,966

  • పురుషులు : 1,19,985

  • మహిళలు : 1,27,933

  • ఇతరులు : : 48

  • కీలక సామాజిక వర్గాలు

  • పద్మశాలి, తొగట, దేవాంగ : 65,000

  • యాదవులు, నాయిబ్రాహ్మణులు, రజకు లు, ఉప్పర, ఆచార్లు, గాండ్ల, దూదేకు ల బోయ, వడ్డెర : 60,000

  • రెడ్లు : 25 000

  • ఆర్యవైశ్య : 25,000

  • ముస్లిం : 40,000

  • బలిజలు : 7,000

  • ఎస్సీలు : 20,000

  • ఎస్టీలు : 2,000

Updated Date - May 08 , 2024 | 10:04 AM