Share News

సీటీఎం క్రాస్‌లోని అక్రమాలను నిగ్గు తేల్చాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:55 PM

మదనపల్లె మండలం సీటీఎం క్రాస్‌రోడ్డు పంచా యతీలో ఇటీవల జరిగిన అక్రమాలపై విచారించి నిగ్గుతేల్చాలని సీటీఎం టీడీపీ క్లస్టర్‌ ఇనచార్జి చల్లా నరసింహులు, వై.భాస్కర్‌రెడ్డి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరి సిసో డియాను కోరారు.

సీటీఎం క్రాస్‌లోని అక్రమాలను నిగ్గు తేల్చాలి
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ, జనసేన నాయకులు

సిసోడియాకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు

మదనపల్లె టౌన, జూలై 26: మదనపల్లె మండలం సీటీఎం క్రాస్‌రోడ్డు పంచా యతీలో ఇటీవల జరిగిన అక్రమాలపై విచారించి నిగ్గుతేల్చాలని సీటీఎం టీడీపీ క్లస్టర్‌ ఇనచార్జి చల్లా నరసింహులు, వై.భాస్కర్‌రెడ్డి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరి సిసో డియాను కోరారు. శుక్రవారం సిసోడియా ను కలసిన అనంతరం టీడీపీ నాయకులు సీటీఎంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీటీఎం క్రాస్‌లో వైసీపీ నాయకులు జగనన్న ఇళ్ల పథ కం కింద అనర్హులకు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని ఆరోపించారు. పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయకుండా డబ్బులు ఇచ్చిన వారికే ఇళ్ల స్థలాలు కేటాయించడ మే కాకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోలేదన్నారు. ఈ గ్రామ పరిధిలో ప్రైవేటు కళాశాల పక్కన వేసిన లేఅవుట్‌లో ప్రజాప్రయోజనాల కోసం వదలిన స్థలాన్ని కొందరు ఆక్రమించారన్నారు. వైసీపీ బడా ప్రజాప్రతినిధుల పేరు చొప్పుకుని ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఆక్రమించారన్నారు. మూడేళ్లలో పలు అక్రమాలకు పాల్పడిన వైసీపీ నాయకులపై విచారించి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని సిసోడియాకు వినతి పత్రం ఇచ్చామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన నాయకులు మాజీ సర్పంచ రెడ్డిరామ్‌ ప్రసాద్‌, వేమన్న, రాజు, భాస్కర్‌, భాను, శివ పాల్గొన్నారు.

ప్రజాప్రయోజనాల స్థలంలో అక్రమ నిర్మాణాలు

సబ్‌కలెక్టరేట్‌లో ఫిర్యాదుచేసిన గుర్రంకొండ ప్రజలు

మదనపల్లె టౌన, జూలై 26: గుర్రంకొండ మండలం చిట్టిబోయినపల్లెలో పదేళ్ల క్రి తం ఇందిరమ్మకాలనీలో ప్రజాప్రయో జనాల కోసం వదలిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేప ట్టారని గుర్రంకొండ టీడీపీ నాయకులు, ప్రజలు మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు శుక్రవారం సబ్‌కల్టెరేట్‌ వద్ద వారు మాట్లాడుతూ పదేళ్ల క్రితం 618 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించగా, మిగిలిన స్థలంలో ప్రజల సౌకర్యం కోసం రెవెన్యూ అధికారుల సహకారంతో అక్కడ ఆలయం, మసీదులు నిర్మించామన్నారు. కాని కొందరు వైసీపీ నాయకులు 32 ఫ్లాట్లకు నకిలీ పట్టాలు సృష్టించి, అక్రమ నిర్మాణాలు చేపట్టారన్నారు. ఈ విషయమై పలుమార్లు రెవెన్యూ, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీనిపై విచారించి కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కాపాడాలని ఏవోకు వినతి పత్రం అందజేశామన్నారు. కార్యక్రమంలో గుర్రంకొండ మాజీ సర్పంచ నౌషాద్‌అహ్మద్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:55 PM