Share News

మాధవరెడ్డి సన్నిహితులను కూడా విచారించాలి

ABN , Publish Date - Jul 24 , 2024 | 11:09 PM

మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో కీలక ఫైళ్లు దగ్దం కేసులో పో లీసులు అనుమానిస్తున్న వైసీపీ నాయకుడు రైస్‌మిల్లు మాధవరెడ్డితో పాటు అతని సన్నిహితులను కూడా పోలీసులు విచారిస్తే మరిన్ని కుట్రలు బయటపడతాయని రాజం పేట పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ అన్నారు.

మాధవరెడ్డి సన్నిహితులను కూడా విచారించాలి
విలేకర్లతో మాట్లాడుతున్న టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ

మదనపల్లె టౌన, జూలై 24: మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో కీలక ఫైళ్లు దగ్దం కేసులో పో లీసులు అనుమానిస్తున్న వైసీపీ నాయకుడు రైస్‌మిల్లు మాధవరెడ్డితో పాటు అతని సన్నిహితులను కూడా పోలీసులు విచారిస్తే మరిన్ని కుట్రలు బయటపడతాయని రాజం పేట పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ అన్నారు. బుధవారం స్థానిక నిమ్మనపల్లె సర్కిల్‌ వద్ద టీడీపీ కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫైళ్ల దగ్దం కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, ఈ ఘటనలో వైసీపీ నాయకులకు చెందిన 22-ఏ ఫైళ్లతో పాటు సామాన్య ప్రజలకు చెందిన విలువైన ఫైళ్లు తగలబడి పోయాయన్నారు. ఇక్కడ పనిచేసిన ఆర్డీవో మురళి హయాంలో ఎక్కువగా అక్రమాలు జరిగాయని ఆరోపించా రు. దీనినంతటినీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి వెనుక వుండి నడిపారన్నారు. మాధవరెడ్డి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు రెండు బస్తాల్లో రెవెన్యూ రికార్డులు లభించినట్లు తెలిసిందని, అదే విధంగా అతని సన్నిహితులైన తట్టివారిపల్లెకు చెందిన వైసీపీ నాయకుడు, మున్సిపల్‌ సీనియర్‌ కౌన్సిలర్‌, సీటీఎం ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడి నివాసాల్లో సోదాలు చేసివుంటే మరిన్ని సాక్ష్యాలు బయటపడేవని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకుడు అన్వర్‌బాషా పాల్గొన్నారు.

ఎమ్మెల్యే చొరవతోనే అక్రమాలు బట్టబయలు

మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా చొరవతోనే వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు, భూదందాలు బయటపడు తున్నాయని టౌన బ్యాంకు మాజీ చైర్మన నాదె ళ్ల విద్యాసాగర్‌ తెలిపారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే నివాసం వద్ద టీడీపీ నాయకులు విలేకర్ల సమావేశం నిర్వహించారు. విద్యాసాగర్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత షాజహానబాషా మదనపల్లె ప్రాంతంలో వైసీపీ నాయకుల భూదందాపై దృష్టి పెట్టారన్నారు. రెవెన్యూ అధికారుల విచారణలో సుమారు రూ.500 కోట్ల ప్రభుత్వ, డీకేటీ, లిటిగెంట్‌ భూములు వైసీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయని తెలిసిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయిస్తామని షాజహానబాషా హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఆదివారం రాత్రి కీలక 22-ఏ విభాగంలో ఫైళ్లు తగలబడి పోయిన సంఘటన చోటుచేసుకుందన్నారు. ఈ వ్యవహారంలో కొందరు వైసీపీ నాయకుల హస్తం వుందని ఆరోపించారు. టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎస్‌ఏ మస్తాన, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రాటకొండ మధుబాబు మాట్లాడుతూ ఫైళ్ల దగ్ధం ఘటనపై సీఐడీ అధికారులు లోతుగా ధర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ ఘటన వెనుక ఎంతటి వారున్నా సీఎం చంద్రబాబు వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు సంగం శ్రీనివాసులు, నీలకంఠ, గౌతమ్‌రెడ్డి, బాబునాయుడు, షంషీర్‌, నాదెళ్ల శివన్న, నాగూర్‌వలి, సుద్దిళ్ల సుధాకర్‌, సహదేవనాయుడు, జంగాల రమణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2024 | 11:09 PM