Share News

మాలేపాడులో కొత్తభవనాలనే కొనసాగించాలి

ABN , Publish Date - Jul 24 , 2024 | 12:15 AM

మదన పల్లె మండలం మాలేపాడు పంచా యతీ దేవళంపల్లెలో నిర్మించిన కొత్త సచివాలయ భవనాల్లోనే పాలన నిర్వహించాలని 10గ్రామాలకు చెంది న ప్రజలు కోరారు.

మాలేపాడులో కొత్తభవనాలనే కొనసాగించాలి
సచివాలయం వద్ద పశువులు తోలుకెళ్లి నిరసన తెలుపుతున్న గ్రామస్థులు

మదనపల్లె టౌన, జూలై 23: మదన పల్లె మండలం మాలేపాడు పంచా యతీ దేవళంపల్లెలో నిర్మించిన కొత్త సచివాలయ భవనాల్లోనే పాలన నిర్వహించాలని 10గ్రామాలకు చెంది న ప్రజలు కోరారు. ఆమేరకు మం గళవారం దేవళంపల్లెలో నిర్మించిన గ్రామ సచివాలయం, విలేజ్‌ హెల్త్‌ భవనాల వద్దకు ఆవులను తోలుకొచ్చి గ్రామస్థులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త సచివాలయ భవనాలు దేవళంపల్లె, కత్తివారిపల్లె, పచ్చిపాలపల్లె, ఎగువ దొనబైలు, దిగువ దొనబైలు, బొంతలవూరు, గురుమాన్యం, కృష్ణాపు రం, మద్దిగుండ్లపల్లె, ఆవులపల్లె గ్రామాలకు దగ్గరగా ఉన్నాయన్నారు. కాని కొంత మంది రాజకీయం చేసి దేవళంపల్లెలో ఉన్న సచివాలయాన్ని మాలేపాడు గ్రామానికి తరలించి అక్కడ పాత స్కూలు భవనాల్లో నిర్వహించడం తమకు ఇబ్బందిగా ఉందన్నారు. ఇరుకు భవనాల్లో సచివాలయం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికై అధికారులు, స్పందించి కొత్త భవనాల్లోనే సచివాలయం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్ర మంలో గ్రామస్థులు శంకర, రామచంద్ర, వెంకటరమణ, ఎస్‌.చంద్ర, శోభ, నరసమ్మ, చెన్నెమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2024 | 12:15 AM