Share News

రికార్డుల తనిఖీల్లో అధికారులు

ABN , Publish Date - Jul 24 , 2024 | 12:13 AM

ములకలచెరువు తహసీల్దార్‌ కార్యాయలంలో రికార్డుల పరిశీలన మంగళవారం తెల్లవారుజామున వరకు సాగింది.

రికార్డుల తనిఖీల్లో అధికారులు
బి.కొత్తకోట తహసీల్దార్‌ కార్యాలయంలో ఫైళ్లను సిద్ధం చేస్తున్న రెవెన్యూ అధికారులు

ములకలచెరువు, జూలై 23: ములకలచెరువు తహసీల్దార్‌ కార్యాయలంలో రికార్డుల పరిశీలన మంగళవారం తెల్లవారుజామున వరకు సాగింది. మదన పల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రికార్డులు దహ నం కావడంతో కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి ముందస్తు జాగ్రత్తలు తీసుకు న్నారు. మదనపల్లె ఘటనలో కుట్ర కోణం బయట పడడంతో మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయం పరిధిలోకి వచ్చే ములకలచెరువు తహసీల్దార్‌ కార్యాలయాంలో రికార్డులుభద్ర పరిచే చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక తహసీల్దార్‌ కార్యాయంలో సోమవారం రాత్రి ఏడు గంటల నుంచి రాయచోటి ఆర్డీవో రంగాస్వామి పర్యవేక్షణలో రాయచోటి తహసీల్దార్‌ జయన్న రికార్డుల తనిఖీ చేపట్టిన విషయం విదితమే. ఇక్కడి నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి పంపిన రికార్డులను పరిశీలించారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు రికార్డులు, ఫైళ్ళ ఓసీలను తనిఖీ చేశారు. 22(ఎ) భూ రికార్డులు, భూ వివాదాలకు సంబంధించిన ఆర్‌వోఆర్‌ రికార్డులు, వ్యవసాయ భూమి నుంచి కనవర్షనకు దరఖాస్తు చేసుకున్న మొత్తం 40 ఫైళ్ళను అధికారులు వెంట తీసుకెళ్లారు. వాటిని కలెక్టర్‌కు అందజేస్తామని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్‌ అనీల్‌ కుమార్‌, డీటీ హరికుమార్‌, ఆర్‌ఐ వీరాంజనేయులు పాల్గొన్నారు.

రికార్డులు సబ్‌కలెక్టర్‌ ఆఫీసుకు తరలింపు

వాల్మీకిపురం, జూలై 23: మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఆదివారం రాత్రి 22ఎ రికార్డుల విభాగం దహనం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విష యాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈనేపథ్యంలో వాల్మీకిపురం తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం రాత్రి 8గంటల నుంచి మంగళవారం ఉదయం 7గంటల దాకా పరిశీలించిన రికార్డులను మొత్తం మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి తరలించారు. వాల్మీకిపురం మండల తహసీల్దార్‌ కార్యాల యంలో రికార్డుల భద్రత విషయమై ప్రత్యేక అధికారులను నియమించారు. హెచఎనఎనఎస్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాఘవేంద్ర, పీలేరు, గాలివీడు తహసీ ల్దార్లను వాల్మీకిపురం మండలానికి ప్రత్యేకాధికారులుగా నియామకం చేశా రు. కాగా రికార్డుల పరిశీలనలో స్థానిక రెవెన్యూ అఽధికారులు, సిబ్బంది 01-04-2022 నుంచి మంగళవారం వరకు మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాల యానికి పంపిన ప్రతి రికార్డును పరిశీలించి కట్టుదిట్టం చేశారు. 22ఎ, ఇళ్ల స్థలాలు, ఆర్‌టీఏ, ఆసైనడ్‌, వెబ్‌ల్యాండ్‌, డీకేటీ తదితర రికార్డులు మొత్తం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో స్థానిక తహసీల్దార్‌ ఖతిజునకుఫ్రా, డిప్యూటీ తహసీల్దార్‌ ఫిరోజ్‌ఖాన, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

కురబలకోటలో: మండలంలోని కురబలకోట తహసీల్దార్‌ కార్యా లయాన్ని పోలీసులు మంగళవారం తనిఖీ చేశారు. మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రికార్డులు కాలిపోలిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తంబళపల్లె నియోజకవర్గంలోని అన్ని తహసీల్దార్‌ కార్యాలయాలకు పోలీసులు వెళ్లి రికార్డుల గదులను పరిశీలిం చారు. కాగా కురబలకోటలో సీఐ సద్గురుడు తన సిబ్బందితో వెళ్లి రికార్డుల గదిని పరిశీలించి సీసీ కెమెరాలు లేకపోడంతో ప్రశ్నించారు. కార్యాలయంలో కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుని అవసరమైన కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. కాగా 22ఏకి సంబంధించి సోమవారం రాత్రి రాయచోటి ఆర్డీవో రంగస్వామి, తహశీల్థార్‌ ఈశ్వరమ్మ, డీటీ నవీన తాజ్‌ల ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో ఎనవోసి మంజూరు, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను సిద్దం చేసి తహసీల్దార్‌ మదనపల్లె సబ్‌కలెక్టర్‌కు అందజేశారు.

భూముల రికార్డులు మరో సెట్‌ తయారీ

బి.కొత్తకోట, జూలై23: మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో భూములకు సంబంధించిన విలువైన ఫైళ్లు కాలిపోయిన నేపథ్యంలో అధికారులు అప్ర మత్తమయ్యారు. ఈ కార్యాలయానికి వివిధ మండలాలనుంచి పంపించిన చుక్కలభూములు, 22ఏ, ల్యాండ్‌ కన్వర్‌షన, అసైనమెంట్‌, అలినేషన తదిత ర భూకేటాయింపుల ఫైళ్లను మరో సెట్‌ చేసి సిద్ధం చేయాలని భావించారు. ఈ క్రమంలో బి.కొత్తకోట మండలానికి ప్రత్యేక అధికారిగా నియమితులైన సబ్‌కలెక్టర్‌ లీలారాణి సోమవారం రాత్రంతా సిబ్బందితో కలిసి ఫైళ్ల పరిశీ లనలో పాల్గొన్నారు. ఆమె ఆధేశాలు,సూచనల మేరకు డీటీ అన్సారీ ఆధ్వ ర్యంలో రెవెన్యూ సిబ్బంది అన్ని రకాల ఫైళ్లను పరిశీలించి, వాటి జిరాక్స్‌ ప్రతులతో మరో సెట్‌ను తయారు చేశారు. 2022 ఏప్రిల్‌ నుంచి ఇప్పటిదాకా సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి పంపిన సుమారు 80 ఫైళ్లను డిసి్ట్రబ్యూషన రిజిస్టర్‌ ఆధారంగా పరిశీలించారు. వీఆర్వోలు, సహాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2024 | 12:13 AM