Share News

మూడో రోజు 188 పోస్టల్‌బ్యాలెట్‌ ఓట్లు పోలింగ్‌

ABN , Publish Date - May 08 , 2024 | 12:07 AM

మదనపల్లె అసెంబ్లీ, రాజంపేట పార్లమెంట్‌ నియో జకవర్గాలకు సంబంధించి నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌లో మూడో రోజున 188 ఓట్లు మాత్రమే పోల య్యాయి.

మూడో రోజు 188 పోస్టల్‌బ్యాలెట్‌ ఓట్లు పోలింగ్‌
సబ్‌కలెక్టరేట్‌లో పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో వేచివున్న ఉద్యోగులు

మదనపల్లె టౌన, మే 7: మదనపల్లె అసెంబ్లీ, రాజంపేట పార్లమెంట్‌ నియో జకవర్గాలకు సంబంధించి నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌లో మూడో రోజున 188 ఓట్లు మాత్రమే పోల య్యాయి. మంగళవారం స్థానిక సబ్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్ర మంలో 443 మిగిలిన ఓట్లకు గాను 188 మంది మాత్రమే ఓటుహక్కు వినియో గించుకున్నారు. మొత్తం 3050 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల విధులు కేటాయించగా తొలిరోజున 1906 మంది, రెండో రోజున 721 మంది ఓటుహక్కు వినియోగించకున్నారు.

పీలేరులో: పీలేరులో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ ప్రక్రియలో మూడవరోజైన మంగళవారం ప్రశాంతంగా ముగిసిం ది. పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రా న్ని స్థానిక తహసీల్దారు కార్యాలయం లో ఏర్పాటు చేశారు. తొలి రెండు రోజులు ఓటు హక్కు వినియోగించు కోని 203 మందిలో మంగళవారం 147 మంది ఓటు వేశారు. దీంతో ఆది, సో మ, మంగళవారాల్లో మొత్తం 2507 మందికిగాను 2451(97.77 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా 56 మంది ఓటు హక్కు వినియో గించుకోవాల్సింది ఉన్నదని, వారికి బుధవారం ఆఖరు అవకాశ మని నియోజకవర్గ ఆర్‌వో ఫర్మాన అహ్మద్‌ తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటలలోపు వారు తహసీల్దారు కార్యాలయంలో ఓటు వేయవచ్చన్నారు.

తంబళ్లపల్లెలో: తంబళ్లపల్లె నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్‌ ఓటింగ్‌ ప్రక్రియ మూడో రోజైన మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం తంబళ్లపల్లె తహసీల్దారు కార్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికలు నిర్వహించగా మూడో రోజు 37 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. కాగా, నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 1659 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఉండగా మొదటి రోజున 998మంది, రెండో రోజున 498 మంది, మూడో రోజున 37 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Updated Date - May 08 , 2024 | 12:07 AM