పెయింటర్స్ కాలనీ నగరపంచాయతీ లోనే ఉండాలి
ABN , Publish Date - Sep 02 , 2024 | 11:48 PM
బి.కొత్తకోట మండలం బీరంగి పంచాయతీ పరిధిలో నిర్మిత మైన పెయింటర్స్ కాలనీని బి.కొత్తకోట నగరపంచాయ తీ పరిధిలోనే కొనసాగించాలని ఆ కాలనీవాసులు, సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
బి.కొత్తకోట, సెప్టెంబరు2: బి.కొత్తకోట మండలం బీరంగి పంచాయతీ పరిధిలో నిర్మిత మైన పెయింటర్స్ కాలనీని బి.కొత్తకోట నగరపంచాయ తీ పరిధిలోనే కొనసాగించాలని ఆ కాలనీవాసులు, సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఆ మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎ దుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2003లో టీడీపీ హయాంలో నిర్మించిన ఈ కాలనీలో అందరూ బి.కొత్తకోటకు చెందిన పెయింటర్లు, తాపీ మేస్త్రీలు ఉంటున్నారని, 15ఏళ్లుగా కాలనీకి మౌలికవసతుల కల్పన, ఇళ్లకు అసెస్మెంట్ నంబర్లు, విద్యుతమీటర్లకు ఎన్వోసీలు ఇవ్వడం తోపాటు, ఇంటిపన్నులు సైతం నగరపంచా యతీ వారే వసూలుచేస్తూ వస్తున్నారన్నారు. ఇప్పుడు నిరాకరించి బీరంగి పంచాయతీ ద్వారా వసతులు పొందాలని చెప్పడం సమంజసంకాదన్నారు. ఈ మేరకు తహసీల్దార్ శ్రీధర్‌రావు, నగరపంచాయతీ కమిషనర్ పీఆర్ మనోహర్ లకు వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు మనోహర్‌రెడ్డి, బషీర్‌ఖాన, ఏఐటీయూసీ నాయకులు అష్రఫ్‌అలీ, షమీవుల్లా, రఘునాథ్, చంద్రశేఖర్, రమేష్ లతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.