పార్వతీ తనయ గణాధిపా
ABN , Publish Date - Sep 08 , 2024 | 11:59 PM
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పార్వతి తనయుడు గణనాథుడికి ప్రజలు భక్తిశ్ర ద్ధలతో పూజలు చేస్తున్నారు.
భక్తిశ్రద్ధలతో బొజ్జ గణపయ్యకు పూజలు వాడవాడలా మండపాలలో ఏర్పాటైన గణనాథులు ఊరూవాడా వెల్లివిరిసిన ఆధ్యాత్మిక వాతావరణం
మదనపల్లె అర్బన/టౌన, సెప్టెంబరు 8: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పార్వతి తనయుడు గణనాథుడికి ప్రజలు భక్తిశ్ర ద్ధలతో పూజలు చేస్తున్నారు. శనివారం ఉదయం మండపాలకు చేరుకు న్న గణనాథులను ఆయా మండపాల నిర్వాహకులు, ప్రజలు ప్రతిష్టిం పచేసి పూజలు చేస్తున్నారు. ఇందులో కొందరు మూడు రోజుల పాటు పూజలు చేస్తుండగా మరి కొందరు ఐదు రోజులు, ఏడు, తొమ్మి ది, పద కొండు ఇలా వారివారి శక్తి కొలది గణనాథులకు పూజలు చేసి నిమ జ్జనం చేయనున్నారు. మదనపల్లె పట్టణం, గ్రామీణా ప్రాంతాల్లో మం డపాల్లో ఏర్పాటు చేసిన గణేశ విగ్రహాలను శనివారం ప్రతిష్టించి పూజలు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పట్టణంలో కమ్మవీధి, కమ్మగడ్డవీధి, రెడ్డెప్ప నాయుడు కాలనీ, ఆర్యవైశ్య కళ్యాణమండపం, సిపాయివీధి, కృష్ణానగర్, తూర్పు కొత్తపేట, కనకదాస్‌నగర్, నీరు గట్టువారిపల్లె, గొల్లపల్లె, సుభాస్‌రోడ్డు, దేవళంవీధి, శాస్త్రీవీధి, ఇందిరాన గర్, ప్రశాంతనగర్, అమ్మినేనివీధి, బుగ్గకాలువ, వీవర్స్ కాలనీ, రెడ్డీస్ కాలనీ, సొసైటీ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూజల్లో స్థానిక ఎమ్మెల్యే షాజహానబాషా, జనసేన రాయల సీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన భవానీ ప్రసాద్, మాజీ టౌన బ్యాంకు విద్యాసాగర్, సీడ్ మల్లికా ర్జున, కోర్టులో గంగమ్మ ఆలయం చైర్మన మార్పూరి చిన్నరెడ్డెప్ప, చౌడేశ్వ రీ ఆలయకమిటీ అధ్యక్షుడు పురాణం చంద్రశేఖర్, ప్రసన్న ఆజంనేయ స్వామి ఆలయకమిటీ అధ్యక్షుడు పురాణం వెంకటరత్నం, తదితరులు గణేశ పూజల్లో పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా పట్టణంలో, రూరల్‌లలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మదనపల్లె పట్టణంలోని దిగువ కురవంక, రెడ్డీస్‌కాలని, దేవళం వీధి, ప్రశాం తనగర్, కృష్ణానగర్, ప్రాంతాల్లో ఎమ్మెల్యే షాజ హానబాషా చవితి వేడు కల్లో పాల్గొన్నారు. స్థానిక త్యాగరాజు వీధిలో అయ్యప్పస్వామి అలంకారంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం ప్రజలను ఆకట్టుకుంది. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ తులసి, రామకృష్ణ, టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఏ మస్తాన, దిగువ కురవంకలో మార్పురి వరుణ్, పగడాల యశ్వంత, రోజా ఫ్లాట్లు, ఎస్‌బీఐ కాలని, రెడ్డెపనాయుడు కాలినిల్లో నాదెళ్ల శివన్న, షంషీర్, సహదేవనాయుడు తదితరులు పాల్గొన్నారు.
నిమ్మనపల్లిలో: మండలంలోని అన్ని గ్రామాలలో బాజాభజంత్రీల మధ్య శనివారం వైభవంగా వినాయక చవితి వేడుకలను నిర్వహిం చారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో వినాయకుడి విగ్రహాలు ప్రతి ష్టించి పూజలు చేశారు. జనసేన మండల ఉపాధ్యక్షుడు ఈటకట్ట చంద్రశేఖర్ దిగువవీధిలో వెలసిన గణేష్ విగ్రహనికి రూ. 25వేలు, మరి కొన్ని విగ్రహాలకు రూ.15వేలను అందించి ఆయన భక్తిని చాటుకొన్నారు.
పెద్దమండ్యంలో: పెద్దమండ్యం మండలంలో వినాయక చవితి పండ గను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈసందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలో సుమారు 60 చోట్ల వినాయక స్వామి విగ్రహాలును భక్తులు ఏర్పాటు చేసుకున్నారు. కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
పండుగకు ఉచితంగా మినరల్ వాటర్
పెద్దమండ్యంకు చెందిన కేసీ మురాషా అనే ముస్లిం వినాయక చవితి పండగ సందర్భంగా మూడు రోజులు (తాగునీరు) మినరల్ వాటర్
పీలేరులో వినాయకుడికి పూజలు చేస్తున్న నిర్వాహకులు ఉచితంగా సరఫరా చేసి దాతృత్వం చాటుకుంటున్నాడు. వినాయక చవితి పండగ సందర్భంగా మినరల్ వాటర్ ప్లాంట్ వద్దకు వచ్చి ఉచితంగా మినరల్ వాటర్ తీసుకుపోచ్చునని గ్రామంలో దండోర వేయించారు. దైవభక్తితో గ్రామంలో మినరల్ వాటర్ ఉచితంగా అందిం చిన మురాషాకు ప్రజలు అభినందించారు.
పీలేరులో: పీలేరు మండల ప్రజలు శని, ఆదివారాల్లో వినాయక చవితి పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా విఘ్నేశ్వరుడు కొలువుదీరిన మండపాలను, ఆలయాలను ప్రజలు కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చాలా మంది మహిళలు వివిధ ఆలయాల్లోని నాగుల పుట్టలకు పాలు పోసి, నోము దారాలు చుట్టారు. వినాయక చవితి సందర్భంగా ఈ ఏడాది పీలేరు మండలంలో 186 కేంద్రాల్లో వివిధ రూపాల్లో ఉన్న వినా యకుడి విగ్రహాలను ప్రతిష్టించారు. ఉత్సవాల్లో రెండవ రోజైన ఆదివారం ఆయా మండపాల వద్ద నిర్వాహకులు అన్నదానం చేశారు. అత్యధిక కేంద్రాల్లో అన్నదాన కార్యక్రమాల్లో ముస్లింలు కూడా భాగస్వా మ్యులై మతసారస్యాన్ని చాటుకున్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం పీలేరులోని బ్రాహ్మణ సంఘం సభ్యు లు భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం నిర్వహించారు. పీలేరు మం డలం దొడ్డిపల్లె పంచాయతీ శివరామాపురంలోని భ్రమరాంబిక సమేత మల్లిఖార్జున స్వామి ఆలయం వద్ద గార్గేయ నదిలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తెనాలి శేషగిరిరావు, ఉద్యా ఫణీంద్ర శర్మ, సభ్యులు నరసింహమూర్తి, తెనాలి రామసుబ్రహ్మణ్యం, రిటైర్డు బ్యాంకు మేనేజర్ విరూపాక్షం కాశీనాథ్, సూత్రం కిరణ్ కుమార్ శర్మ, బీవీఎస్‌ఆరకే ప్రసాద్, విరూపా క్షం విశ్వనాథ్, విరూపాక్షం ఉదయ్ చంద్, ప్రభాకర్ రావు, శ్రీనివాసులు, శ్రీధర్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.
నేడు నిమజ్జనం: పీలేరు పట్టణంలో సోమవారం గణేశ నిమజ్జనానికి ఏర్పాటు చేసినట్లు గణేశ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి వారణాశి మోహన రెడ్డి తెలిపారు. పీలేరు పట్టణంలోని 90 కేంద్రాలతోపాటు పరిసర ప్రాంతాల్లోని కేంద్రాల వారు పీలేరు పట్టణంలో జరిగే నిమజ్జన ర్యాలీలో పాల్గొనేందుకు పోలీసుల అనుమతి తీసుకున్నారని ఆయన తెలిపారు. ప్రతి కేంద్రం వారు తమ ప్రాంతం నుంచి నెహ్రూబజారు లోని కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద పోలీసులు, ఉత్సవ కమిటీ వారు అందించే టోకెన్ల ప్రకారం నిమజ్జనంలో పాల్గొనాలని సూచించారు.
వాల్మీకిపురంలో: వాల్మీకిపురం మండల వ్యాప్తంగా శనివారం వినాయ క చవితి పండుగ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. మండలం లోని గ్రామ గ్రామాన ప్రతి ఇంటా మట్టి వినాయక ప్రతిమలు ఏర్పాటు చేసి విశేష అలంకరణలతో పూజలు నిర్వహించారు. పట్టణంలోని తోట వీధి, కొత్తపేట వీధి, ఇందిరమ్మకాలనీ, గాంధీపేట, జెట్టిపాళ్యం, బజారు వీధి, చాకలవీధి, పింగాణి, ఫ్యాక్టరి, తదితర ప్రాంతాలలో భారీ వినా యక విగ్రహాలు ఏర్పాటు చేసి వైభవంగా పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ప్రముఖ దేవాలయాలు భక్తుల సందడితో కిటకిట లాడాయి. స్థానిక సీఐ ప్రసాద్‌బాబు ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీహరి బందో బస్తు నిర్వహించి వేడుకలను పర్యవేక్షించారు.
పెద్దతిప్పసముద్రంలో: మండలంలోని వివిధ గ్రామాల్లో వినాయక చవితి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకుంటు న్నారు. శనివారం ఉదయం నుంచి ఆయాగ్రామాల్లో వినాయక విగ్రహా లు కొలువుదీరాయి. పలు గ్రామాల్లో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు వినాయకుల కోసం ప్రత్యేకంగా మండపాలు ఏర్పాటు చేసి విభిన్న రూపాల్లో గణేశ విగ్రహాలను కొలువుదీర్చి పూజలు, అభిషేకాలు నిర్వ హించారు. పీటీఎం మండల కేంద్రమైన మైనరోడ్‌లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం నాయ కుడైన మలిగి మధుసూదనరెడ్డి రూ.30 వేలు వెచ్చించి విగ్రహాన్ని వితరణ చేయడంతో యువకులు భక్తి శ్రద్ధలతో వినాయక పూజలు నిర్వహించుకున్నారు. వినాయక చవితి వేడుకల్లో చింతకాయల వినోద్, గంగాద్రి రెడ్డెప్ప, సాయి, రాజేష్, రెడ్డిప్రసాద్, పాల్గొన్నారు.
రామసముద్రంలో: మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక చవితి వేడుకలు ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈసందర్భంగా మండపాలను విద్యుద్దీపాలు, పూలతో శోభాయమానంగా అలంకరిం చారు. రామసముద్రం మండల కేంద్రంలోని ఎగువ దళితవాడలో 20అడుగుల భారీ వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. ఆయా గ్రా మాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు.
కురబలకోటలో: కురబలకోట మండలంలో వాడవాడలా వినాయక చవితి పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మం డలంలోని అంగళ్ళు, కురబలకోట, ముదివేడు, మట్లివారిపల్లె తదితర గ్రామాల్లో వినాయకుడి ప్రతిమలను ప్రతిష్టించి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ బీసీ సెల్ అధ్యక్షుడు సురేంద్రయాదవ్, సర్పంచ విశ్వనాథరెడ్డి, భానుప్రకాష్ రాయల్, అయూబ్‌బాషా, బాలకృష్ణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కలికిరిలో: వినాయక చవితి సందర్భంగా శనివారం కలికిరి మండలం లో వాడవాడలా గణపతి విగ్రహాలను ప్రతిష్టించి సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. చాలా చోట్ల సోమవారం నిమజ్జనం చేయను న్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిమజ్జనం చేసే ప్రాంతాలను కలికిరి పోలీసు ఇనస్పెక్టరు రెడ్డిశేఖర్ రెడ్డి పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న కారణంగా విద్యుద్దీపాల అలంకరణలో జాగ్రత్తలు పాటించాలన్నారు.
గుర్రంకొండలో:వినాయక చవితి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వాడవాడలా వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారిని వివిధ రకాల పూలతో ప్రత్యేకం గా అలంకరించారు. ఆయా గ్రామాల్లో అన్నదానం నిర్వహించారు.
కలకడలో:వినాయక చవితి పండుగను మండల ప్రజలు శనివారం వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కలకడ, ఎర్రయ్యగారిపల్లె, కోన, బాటవారిపల్లెతోపాటు వివిధ గ్రామాల్లో వివిధ రూపాలున్న వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలను చేశారు. ప్రజలు వారి వారి ఇళ్లలో గణపయ్యలను ఏర్పాటు చేసి పూజలను చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిపి అన్నదానాలు చేశారు.
బి.కొత్తకోటలో: బి.కొత్తకోట నగర పంచాయతీతో పాటు, మండలం లోని అన్ని గ్రామాలలో శనివారం వినాయకచవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధ లతో జరుపుకున్నారు. వినాయక విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని పోకనాటి వీధి, బీసీకాలనీ, పీటీఎంరోడ్, బైపాస్‌రోడ్డు, జయశ్రీకాలనీ, శెట్టిపల్లెరోడ్డు, తదితర ప్రాంతాలలో వినా యక మంటపాలు ఏర్పాటు చేశారు. చవితి సందర్భంగా స్థానిక షిర్డీసా యిబాబా ఆలయంలో వినాయకుడికి విశేష అలంకరణలు చేశారు. సీఐ రాజారెడ్డి పోలీసు సిబ్బందితో కార్యక్రమాలను పర్యవేక్షిం చారు.
ములకలచెరువులో: మండలంలో శనివారం వినాయకచవితి వేడుక లు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక , పోలీస్‌స్టేషన, మద్దినాయనిపల్లె, గాలేటివారిపల్లె, వేపూరికోట గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. అలాగే టీడీపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జయచంద్రారెడ్డి, ఆయన సతీ మణి కల్పనారెడ్డిలు హాజరయ్యరు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యర్రగుడి సురేష్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన కేవీ రమణ, నాయకులు మస్తానరెడ్డి, రమణారెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
తంబళ్లపల్లెలో: తంబళ్లపల్లె మండలంలో వినాయక చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకుంటున్నారు. శనివారం ఉదయం 11గంటలకు చవితి ప్రారంభం కాగానే గౌరీ పుత్రున్ని కొలువు దీర్చారు. పలు గ్రామాల్లో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అలంకరించిన మండపాల్లో విభిన్న రూపాల్లో గణేశుని విగ్రహాలను కొలువు దీర్చి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. తంబళ్లపల్లె మం డల కేంద్రంలో గణేశ యూత ఆధ్వర్యంలో పాత కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన లాల్‌బాగ్ వినాయకుడు అందరిని విశేషంగా ఆకట్టుకు న్నాడు. శనివారం సాయంత్రం స్థానిక పాత కళాశాల మైదానంలో గణేశ యూత సభ్యులు ఏర్పాటు చేసిన తోలు బొమ్మలాట అందరిని విశేషంగా అలరించింది. ఐదు రోజుల పాటు నిర్వహించే వినాయక చవితి వేడుకల్లో 3రోజులపాటు అన్నదానం నిర్వహిస్తున్నట్టు గణేశ యూత సభ్యులు తెలిపారు.