Share News

పారిశుధఽ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి

ABN , Publish Date - Jul 24 , 2024 | 12:19 AM

పారిశుధ్యంపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని మదనపల్లె డివిజినల్‌ పంచాయతీ అధికారి నాగ రాజు వెల్లడించారు.

పారిశుధఽ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి
రంగసముద్రంలో పారిశుధ్య పనులను పరిశీలిస్తున్న డీఎల్‌పీవో

డివిజినల్‌ పంచాయతీ అధికారి నాగరాజు

పెద్దతిప్పసముద్రం జూలై 23 : పారిశుధ్యంపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని మదనపల్లె డివిజినల్‌ పంచాయతీ అధికారి నాగ రాజు వెల్లడించారు. మంగళవారం ఆయన మండలంలోని సంపతికోట గ్రామంలోని కానుగమాకులపల్లెలో పర్యటించారు. పంచాయతీ అధికారులతో కలిసి ఆయన గ్రామంలో ఉన్న చెత్తదిబ్బలను తక్షణం తొలగించాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని, గ్రామాల్లో ఉన్న మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం కాలువల్లో బ్లీచింగ్‌ చల్లాలని ఆదేశించారు. గ్రామాల్లో మంచినీటి ట్యాంకులను వారానికి ఒక రోజు శుభ్రం చేసే విధంగా పంచాయతీ కార్మికులను ఆదేశించారు. అనంతరం ఆయన రంగసముద్రంలో పర్యటించి పంచాయతీలోని పలు గ్రామాల్లో పంచాయతీ కార్మికులు మురుగు నీటి కాలువలను శుభ్రం చేయడాన్ని పరిశీలించి పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో తంబళ్లపల్లె నియోజకవర్గం సర్పం చుల సంఘం అధ్యక్షుడు, సంపతికోట సర్పంచ ఎం. చిన్నరెడ్డెప్ప, మల్లెల సర్పంచ శ్రీకంఠరెడ్డి, దేవప్పకోట సర్పంచ సురేష్‌తో పాటు రంగసముద్రం సర్పంచ శివప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శులు రంగసముద్రం శివప్రసాద్‌, నాగరాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2024 | 12:19 AM