Share News

తహసీల్దార్‌ కార్యాలయాలపై పోలీసుల నిఘా

ABN , Publish Date - Jul 24 , 2024 | 11:07 PM

నియోజకవర్గంలోని ఆరు మండలాల తహసీల్దార్‌ కార్యాలయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.

తహసీల్దార్‌ కార్యాలయాలపై పోలీసుల నిఘా
తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పోలీసుల గస్తీ

ములకలచెరువు, జూలై 24: నియోజకవర్గంలోని ఆరు మండలాల తహసీల్దార్‌ కార్యాలయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో రికార్డులు దగ్ధం కావడంతో ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తంబళ్లపల్లె నియోజక వర్గంలోని ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కురబలకోట, బి.కొత్తకోట మండలాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాలపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. మదనపల్లె ఘటన జరిగినప్పటి నుంచి రాత్రి వేళల్లో పోలీసులు పలు మార్లు తహసీల్దార్‌ కార్యాలయాల వద్దకు వచ్చి పరిశీలించి వెళ్తున్నారు. ములకలచెరువు తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు మంగళవారం రాత్రి వచ్చిన ఏఎస్‌ఐ నజీర్‌అహ్మద్‌, కానిస్టేబుల్‌ నరసింహ కార్యాలయంలో ఎవరెవరూ నిద్రిస్తున్నారో ఆరా తీశారు. నియోజకవర్గం లోని అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో వీఆర్‌ఏలు రాత్రి వేళల్లో నిద్రిస్తూ రికార్డులకు కాపలా ఉంటున్నారు. జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి ఆదేశాలతో మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం పరిధిలోకి వచ్చే తంబళ్ల పల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, కురబలకోట మండలాల తహసీల్దార్ల కార్యాలయాల్లో ఆర్డీవో స్థాయి అధికారులు, రామచోటి నియోజకవర్గానికి చెందిన తహసీల్దార్లు రికార్డులు పరిశీలించి సీజ్‌ చేసిన విషయం విదితమే. ములకలచెరువులో 40, పెద్దమండ్యంలో 32, బి.కొత్తకోటలో 73, కురబలకోటలో 40, తంబళ్లపల్లెలో 41, పెద్దతిప్ప సముద్రంలో 35 వరకు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి నుంచి సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి పంపిన 22(ఎ), చుక్కల భూములు, కన్వర్షన, ఆర్‌వోఆర్‌, కోర్టు కేసులు తదితర రికార్డులను తీసుకెళ్ళి కలెక్టర్‌కు సమర్పించారు. ములకలచెరువు తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా ఉన్న గదిలో రికార్డులను భద్రంగా ఉంచారు. రికార్డులను

Updated Date - Jul 24 , 2024 | 11:07 PM