Share News

పాఠశాల విద్యలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:56 PM

పాఠశాల విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ ఐక్య ఉపా ధ్యాయ ఫెడరేషన నాయకులు డిమాండ్‌ చేశారు.

పాఠశాల విద్యలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి
ఎంఈవోకు వినతిపత్రమిస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

మదనపల్లె అర్బన, జూలై 26:పాఠశాల విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ ఐక్య ఉపా ధ్యాయ ఫెడరేషన నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక ఎంఈవో కార్యా లయం ఎదుట ఎంఈవో ప్రభాకర్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా ఆ ఫెడరేషన అధ్యక్ష, కార్యదర్శులు వెంక టేశ్వర్లు, కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులు విశ్వాసం కోల్పోయి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయిపోతున్నాయని, వాటిని కాపాడే బాధ్యత ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. జీవో నెం.117 రద్దు చేయాలని, జీవో ఎంఎస్‌నెం. 55 ప్రకారం ఉపాధ్యాయులను కేటాయించాలని, ఫ్రీప్రైమరీతోపాటు 1 నుంచి 5 తరగతులను ఒకే పాఠశాలలలో నడపా లని కోరారు. మోడల్‌ స్కూల్‌లో కొవిడ్‌ సమయంలో మృతి చెందిన వారి వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గాలి రవీంద్ర, సుధాక ర్‌నాయుడు, పురం వెంకటరమణ, సుధాకర్‌, సుబ్రహ్మణ్యం, విజయకుమార్‌, పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:56 PM