Share News

రోడ్డెక్కిన టమోటా రైతులు

ABN , Publish Date - May 09 , 2024 | 12:08 AM

టమోటా మార్కెట్‌లో లారీ అసోసియేషన జోక్యాన్ని నిరసిస్తూ టమోటా రైతులు ఆందోళన చేపట్టారు.

రోడ్డెక్కిన టమోటా రైతులు
టమోటాలు రోడ్డుపై పోసి నిరసన చేస్తున్న రైతులు

మదనపల్లె అర్బన, మే 8: టమోటా మార్కెట్‌లో లారీ అసోసియేషన జోక్యాన్ని నిరసిస్తూ టమోటా రైతులు ఆందోళన చేపట్టారు. ఇక్కడి నుం చి టమోటాలను కొనగోలు చేసి బయటి ప్రాంతానికి తరలించేందుకు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న లారీలను అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. బయటి నుంచే లారీలను తరచూ అడ్డుకోవడం, దీనికి ప్రతిగా వ్యాపారులు వేలంపాటలు నిలిపేయడం, తద్వారా రైతులు రోడ్డుపైకి రావడం తరచూ జరుగుతోంది. ఇదే క్రమంలో బయట నుంచి వచ్చిన అయిదు లారీలను మదనపల్లె లారీఅసోసియేషన అడ్డుకోవడం, ఆ లారీలను తమ కార్యాలయం అసోసియేషన కార్యాలయానికి తీసుకెళ్ల డం వివాదానికి కారణమైంది. దీన్ని నిరసిస్తూ అటు బయటి వ్యాపారు లు ఇక్కడి రైతులు మార్కెట్‌కు తెచ్చిన టమోటాలను కొనుగోలు చేయ కుండా నిలిపివేశారు. వ్యాపారులు వేలంపాటలు నిలిపివేయడంతో రైతులు మార్కెట్‌ రెండు గేట్లు మూసేసి వాహనాలను లోనికి వెళ్లనీ యకుండా అడ్డుకున్నారు. మరోవైపు టమోటాలను రోడ్డుపై పోసి, అటు వ్యాపారులు, ఇటు లారీఅసోసియేషన తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తెస్తే, అటు వ్యాపారులు, ఇటు లారీ అసోసియేషన నాయకులు తమను తర చూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. రైతు మార్కెట్‌లో అసోసియేషన, రాజకీయ నాయకులకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30గంటల వరకూ జరిగిన ఆందోళనలో కిలోమీటర్ల దూరం వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్‌కు తీవ్రఅంతరా యం ఏర్పడింది. ఇంత జరుగుతున్నా..టమోటా మార్కెట్‌ కార్యదర్శి అభిలాష్‌ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని రైతులు తప్పుపట్టారు. ఆయన పనితీరుపై రైతులు, వ్యాపారులు మండిపడ్డారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులను అడ్డుకోవడంతో ఇక్కడి నుంచి ఆందోళ నను అన్నమయ్య సర్కిల్‌కు మార్చి రోడ్డుపై బైఠాయించి రోడ్డుపై డ్రమ్ములు పెట్టి వాహనాలను అడ్డుకున్నారు. అక్కడ కూడా ఇదే స్థాయి లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆలస్యంగా చేరుకున్న మార్కెట్‌ కమిటీ చైర్మన తట్టి శ్రీనివాసులురెడ్డిని రైతులు చుట్టుము ట్టారు. ఉదయం 10గంటలకు జరగాల్సిన వేలంపాటలు నిలిచిపోయి, రైతులు రోడ్డుపై ఆందోళన చేస్తుంటే, పత్తా లేకపోవడాన్ని ప్రశ్నించారు. వైసీపీ నాయకులే, లారీ అసోసియేషనకు మద్దతుగా ఉన్నారని, అందు కే వ్యాపారుల లారీలను తీసుకెళ్లి ధైర్యంగా అసోసియేషన కార్యాలయం లో పెట్టారని చైర్మనను నిలదీశారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తాను మార్కెట్‌కు రాలేదని, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తమతోపాటే రోడ్డుపై బైఠాయించాని సూచించారు. అనంతరం అక్కడికి పోలీసులు చేరుకుని రైతులతో, అధికారులతో మాట్లాడి సమ స్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తిరిగీ మధ్యాహ్నం 2:30గంటలకు వేలంపాటలు నిర్వహించారు. కాగా సమస్య పునరావృతం కాకుండా అధికారులు, వ్యాపారులు చర్చిస్తున్నారు.

Updated Date - May 09 , 2024 | 12:08 AM