అపార్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడండి
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:08 AM
ఆయా పాఠశాలల్లో అపార్ ఐడీ కోసం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా చూడాలని సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారి కరుణాకర్ ఉపా ధ్యాయులకు సూచించారు.
పెద్దతిప్పసముద్రం నవంబర్ 19 (ఆంధ్ర జ్యోతి ) : ఆయా పాఠశాలల్లో అపార్ ఐడీ కోసం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా చూడాలని సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారి కరుణాకర్ ఉపా ధ్యాయులకు సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని బూర్లపల్లె జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయు లకు సూచించారు. విద్యార్థులకు అపార్ జనరేషన పనులను వేగవంతం చేయాలన్నారు. అనంతరం పాఠశాలలో గత ప్రభుత్వం లో జరిగిన నాడు - నేడు పనులను పరిశీలించి పెండింగ్లో ఉన్న పాఠ శాల నిర్మాణ పనులను తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట పాఠ శాల ప్రధానోపాధ్యాయులు భీమేశ్వరాచారి, బాలసంజీవ యాదవ్, పెన్నయ్య, లతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.