Share News

ప్రైవేట్‌ బస్సుల దోపిడీని వెంటనే అరికట్టండి

ABN , Publish Date - Jul 25 , 2024 | 11:30 PM

రాష్ట్రంలో నానాటికి పెరిగి పోతున్న ప్రైవేట్‌ బస్సుల దోపిడీని అరికట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డిని గురువారం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు.

 ప్రైవేట్‌ బస్సుల దోపిడీని వెంటనే అరికట్టండి
సమావేశంలో మాట్లాడుతున్న వనడిపో మేనేజరు వెంకటరమణారెడ్డి

మదనపల్లె అర్బన, జూలై 25: రాష్ట్రంలో నానాటికి పెరిగి పోతున్న ప్రైవేట్‌ బస్సుల దోపిడీని అరికట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డిని గురువారం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు మంత్రికి ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ డిమాండ్లును బట్టి టికెట్ల ధరలు పెంచేస్తున్నారని ఆరో పించారు. రవాణా శాఖ అనుమతులు లేనప్పటికీ పలు సర్వీసులు నడుస్తున్నాయని, తనిఖీ చేయాల్సిన అధికారు లు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అవసరాలకు అనుగుణంగా ప్రయాణీకులు హెచ్చు రేట్లు పెట్టి ప్రయాణించడం తప్పడం లేదన్నారు. బస్సుల రిజి సే్ట్రషన పక్క రాష్ట్రాల్లో చేసుకుని ఏపీలో తిప్పుతున్నారని ఆరోపించారు. పక్క మార్గాలైన పల్లె రూట్‌లో నడుపుతూ టోల్‌గేట్‌ చార్జీలను కూడా తప్పించుకుంటున్నారన్నారు. ఇప్ప టికైనా రాష్ట్ర ప్రభుత్వం , రవాణాశాఖ అధికారులు ప్రైవేట్‌ ఆపరేటర్ల టికెట్‌ ధరలను నియంత్రించాలని, అడ్డదారుల్లో దోపిడీకి అడ్డుకట్ట వే యాలని ఆయన కోరారు.

అద్దె బస్సుల్లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి

మదనపల్లె అర్బన, జూలై 25: స్థానిక వన అండ్‌ టూ డిపోలోని అద్దె బస్సుల్లో ప్రయాణి కులకు సౌకర్యాలు కల్పించాలని వన డిపో మేనేజరు మూరే వెంకటరమణారెడ్డి సూచిం చారు. గురువారం స్థానిక వన డిపో కార్యాల యంలో అద్దె బస్సుల యాజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ స్పేర్‌గా టైర్లు ఉంచుకోవాలని, డ్రైవర్లు మ ద్యం తాగి, సెల్‌ఫోన్లు మాట్లాడుతూ బస్సులు నడపరాదని పేర్కొన్నారు. అన్ని స్టేజ్‌లో బస్సు ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోపాటు వారి నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకుండా చూడాలన్నారు. ఆర్టీసీలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కలిం్పంచాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్లు రేవతి, గీతా, ఎంఎఫ్‌ రవి, హైర్‌బస్సు యజమానులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2024 | 11:30 PM