Share News

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేయాలి

ABN , Publish Date - May 08 , 2024 | 12:04 AM

ఏపీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన భూ యాజమా న్య హక్కు చట్టం (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌)ను తక్షణం రద్దు చేయాల్సిందేనని వాల్మీకిపురం మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి డిమాండ్‌ చేశారు.

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేయాలి
వాల్మీకిపురంలో రెవెన్యూ సిబ్బందికి వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నాయకులు

వాల్మీకిపురం, మే 7:ఏపీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన భూ యాజమా న్య హక్కు చట్టం (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌)ను తక్షణం రద్దు చేయాల్సిందేనని వాల్మీకిపురం మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగ ళవారం పార్టీ నాయకులతో కలిసి స్థానిక రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అం దజేస్తూ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌లోని పలు ప్రతిపాదనలు దుష్ఫరిణామాలతో రాష్ట్ర రైతాం గం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారన్నారు. చట్టంలోని ప్రతిపాదనలను పరిశీలిస్తే భూము లు, భవనాలు, ఇతర ఆస్తులు ప్రస్తుతం అనుభవంలో ఉన్న యజమానుల చేతుల్లో నుంచి వైసీపీ నేతల పరం చేసేందుకు కుట్ర జరిగినట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు. పూర్తిగా రైతాంగ వ్యతిరేక చట్టమని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో పీలేరు పార్టీ మైనార్టీ అధ్యక్షులు సయ్యద్‌బాషా, నాయకులు రాజేంద్రాచారి, పీవీ నారాయణ, కోసూరి చంద్రమౌళి, కువైట్‌ సయ్యద్‌బాషా, జాఫర్‌, బొక్కసం బ్రదర్స్‌, ఎండీ యూసుఫ్‌, కేకే నాయుడు, డిష్‌ బ్రదర్స్‌, ఈశ్వర, అస్లాం, రమణ, గోవిందు, ఆదినారాయణ, సాంబ తదితరులు పాల్గొన్నారు.

పెద్దమండ్యంలో: ఏపీ ప్రభుత్వం అమల్లోకి తీసు కొచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ - 2022) రద్దు చేయాలని మంగ ళవారం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు డిమాండ్‌ చేశారు. ఆమేరకు పెద్దమండ్యం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి రెవెన్యూ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చట్టం వల్ల రైతు లు పలు ఇక్కట్లు పడుతున్నారని ఆరోపించారు. వారసత్వం సక్రమించే ఆస్తులకు వారసులు తీవ్ర ఇబ్బం దులు పడాల్సి వస్తోందని వారు తెలిపారు. ఈ చట్టం వెంటనే రద్దుకు రైతుల ఇచ్చిన విన తి పత్రాలను ప్రభుత్వానికి నివేదిక పంపాలని రైతు నాయకులు కోరారు. రాష్ట్ర టీడీపీ శాఖ ఆదే శాల మేరకు వినతి పత్రం అందజేసినట్లు విశ్వనాధరెడ్డి, గంగాధర, నాగేశ్వరరెడ్డి, సీతాపతిరెడ్డి, రఘునాధరెడ్డి, సోమశేఖరరెడ్డి, మహేశ్వర, పవనకుమార్‌ వెల్లడించారు.

Updated Date - May 08 , 2024 | 12:04 AM