Share News

ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన నీరు అందించడమే ధ్యేయం, Clean water to every village

ABN , Publish Date - Aug 30 , 2024 | 11:24 PM

దేశవ్యాప్తంగా ప్రతి గ్రామా నికి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించాలన్నదే కేంద్రప్రభుత్వ ధ్యేయమని కేంద్రపరిశీలన బృందం రిటైర్డ్‌ సీఈఓలు రామ్‌సేన్‌ మ్యాగీ, వెంకటేశ్వర్లు అన్నారు.

ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన నీరు అందించడమే ధ్యేయం, Clean water to every village
మాట్లాడుతున్న కేంద్ర బృందం సభ్యులు రామ్‌సేన్‌మ్యాగీ, వెంకటేశ్వర్లు

కేంద్ర పరిశీలన బృందం రామ్‌సేన్‌ మ్యాగీ

చెన్నూరు, ఆగస్టు 30: దేశవ్యాప్తంగా ప్రతి గ్రామా నికి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించాలన్నదే కేంద్రప్రభుత్వ ధ్యేయమని కేంద్రపరిశీలన బృందం రిటైర్డ్‌ సీఈఓలు రామ్‌సేన్‌ మ్యాగీ, వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలో గతంలో మంజూరు చేసిన జల్‌జీవన్‌ మిషన్‌, స్వచ్చభారత్‌ మిషన్‌ అమలుపై ఆరా తీశారు. కేంద్ర పరిశీలన బృందం శుక్రవారం గుర్రంపాడు, చెన్నూరు గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామ పంచాయతీల్లో సిబ్బంది, ప్రజలతో మాట్లాడారు. గతంలో జల్‌జీవన్‌ పథకం మంజూ రైనా అర్ధంతరంగా ఆగిపోవడం, పలుచోట్ల నిఽధులు లేక నిలిపివేశారని పంచాయతీ సిబ్బంది ప్రజలు చెప్పారు. ఇంటింటికీ కుళాయిలు ఇస్తున్నామన్న పేరుతో నిధులు వసూలు చేస్తారా, అది ఉచితమే కదా అని ప్రజలు ప్రశ్నించారు. జల్‌జవన్‌ మిషన్‌ కేంద్ర పథకమైనా అందులో పంచాయతీ పన్నులతో కలిపి వాటర్‌ట్యాక్స్‌ వసూలు చేస్తామని ఆ పన్నులో నీటి వాటాను వేరు పరిచి తిరిగి జల్‌జీవన్‌ మిషన్‌ పథకానికి ఆ నిధులు తిరిగి ఇస్తామన్నారు. ఏఎన్‌ ఎంలు, ఆశాలు, అంగన్వాడీలు వారి ప్రాంత పరిధి లో తాగునీటిని తరచూ పరీక్షించి నివేదికను ఉన్న తాధికారులకు పంపి అందులో ఫ్లోరైడ్‌ శాతం ఏమ న్నా ఉంటే తెలియజేయాలని, లేకుంటే అలాగే నీటి సరఫరా అందించాలన్నారు. చాలా గ్రామాల్లో డైరెక్టు పంపింగ్‌ స్కీం ఉందని, ప్రతి పంచాయతీలో వాట ర్‌ట్యాంకు ఖచ్చితంగా నిర్మించి తీరాలన్నారు. తద్వా రా ఆ నీటిలో క్లోరినేషన్‌ చేస్తే స్వచ్ఛమైన నీరు అందుతుందన్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ సంబంధించి వైద్యసిబ్బంది, పంచాయతీ సిబ్బందితో మాట్లాడారు. తమకు ఎన్నో ఏళ్లగా వేతనాలు పెంచలేదని, ఇప్ప టికైనా వేతనాలు పెంచి ఆదుకోవాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాల్లో ఆర్‌డబ్ల్యుఎస్‌ డీఈ మురళి, ఏఈ వినోద్‌, ఈఓఆర్‌డీ సురేశ్‌బాబు, పం చాయతీ సర్పంచ్‌లు వెంకటసుబ్బయ్య, చల్లా ప్రమీ లమ్మ, కార్యదర్శులు రామసుబ్బారెడ్డి, పరమేశ్వ ర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 11:24 PM