Share News

ప్రభుత్వాసుపత్రిలో నీటి కష్టాలు

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:52 PM

తంబళ్లపల్లె మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి(సీహెచసీ)లో నీటి కష్టాలు తీవ్రతరమవుతున్నాయి.

ప్రభుత్వాసుపత్రిలో నీటి కష్టాలు
ఆసుపత్రిలో ఎండిపోయిన నీటి బోరు వైద్య సేవల కోసం వచ్చిన రోగులు

నాలుగు నెలల క్రితం బోరులో తగ్గిన నీరు ఇబ్బంది పడుతున్న రోగులు

తంబళ్లపల్లె, జూలై 26: తంబళ్లపల్లె మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి(సీహెచసీ)లో నీటి కష్టాలు తీవ్రతరమవుతున్నాయి. ఆసుపత్రిలో ఉన్న బోరులో నీరు తగ్గిపోవడంతో నాలుగు నెలల నుంచి నీటి సమస్య ఏర్పడింది. దీంతో నిత్యం వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులు, ఇనపేషంట్లు, వారి సహా యకులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. తంబ ళ్లపల్లె ప్రభుత్వాసుపత్రికి మండలం నుంచే కాకుం డా పొరుగు మండలాలైన పెద్దమండ్యం, ములక లచెరువు నుంచి రోజుకు సుమారు వంద మంది వరకు వైద్య సేవల కోసం అవుట్‌ పేషంట్లు వస్తుం టారు. గర్భిణులు, బాలింతలు, వారి సహాయకులు సుమారు 20 మందికి పైగా ఇనపేషంట్లు ఆసు పత్రిలో సేవలందుకుంటుంటారు. వారితో పాటు ఆసుపత్రి వైద్యులు, నర్సులు, సిబ్బంది దాదాపు 30 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆసుపత్రి లో ల్యాబ్‌, క్లీనింగ్‌, మరుగుదొడ్ల వినియోగం, తదిత ర అవసరాలకు కలిపి దాదాపు రోజుకు ఒక ట్యాం కరు పైగా నీరు అవసరమవుతుంది. ఆయితే నాలు గు నెలల కిందట ఆసుపత్రికి నీరు అందించే బోరు లో నీరు పూర్తిగా తగ్గిపోవడంతో నీటి సమస్య ఏర్పడింది. ఇదిలా ఉండగా ఆస్పత్రి వైద్యాధికారి సొంత నిధులతో ట్యాంకర్ల ద్వారా నీటిని తోలిస్తున్నా సరిపోవడం లేదు. దీంతో ఆసుపత్రిలో నీటి ఎద్దడి నెలకొని మరుగుదొడ్లకు నీటి సరఫరా లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం వైద్య సేవల కోసం ఆసుపత్రికి వెళ్లిన మండల సమాఖ్య అధ్య క్షురాలు రామలక్ష్మీ అక్కడ నెలకొన్న నీటి సమస్యను గుర్తించి సిబ్బందిని ప్రశ్నించింది. స్థానిక టీడీపీ నాయకులు క్లస్టర్‌ ఇంచార్జి బేరిశీన, గంగుల్‌రెడ్డి, పురుషోత్తం, సుధాకర్‌రెడ్డి, సుబ్రమణ్యం, స్వామిరెడ్డి లు విషయాన్ని తెలుసుకుని రోగులకు ఇబ్బంది కలుగకుండా అధికారులు స్పందించి నీటి సమస్య ను వెంటనే పరిష్కరించాలని ఆస్పత్రి వైద్యాధికారి వెంకట్రా మయ్యకు వినతి పత్రం అందచేశారు.

పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం..

ఆసుపత్రిలో ఉన్న బోరు నాలుగు నెలల కిందట ఎండిపోవ డంతో సొంత నిధు లతో తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటి ని తోలిస్తున్నాం. అయితే ప్రస్తుతం రోగులు ఎక్కువగా వస్తున్నందున ఈ నీరు చాలడం లేదు. ఈ విషయాన్ని తమ వైద్యశాఖ ఉన్నతా ధికారులతో పాటు పలుమార్లు ప్రభుత్వాసు పత్రుల మౌలిక వసతులు పర్యవేక్షించే ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇనఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన (ఏపీఎంఎస్‌ఐడీసీ) డీఈ, ఏఈల దృష్టికి తీసుకెళ్లాము. ఏపీఎంఎస్‌ ఐడీసీ వారు నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ సమస్యను పట్టించుకోకపోవడంతో.. జూన 10వ తేదీన ఈఈకి వినతిపత్రాన్ని మెయిల్‌ ద్వారా పంపించాం. దీంతో డీఈ, ఏఈ, జియాలజిస్ట్‌ వచ్చి ఆసుపత్రిలో ఉన్న బోరును పరిశీలించి నీరు తగ్గిపోయిందని..నూతన బోరు వేయాలని పాయింట్‌ పెట్టి వెళ్లిపోయారు. అంతే అప్పటి నుంచి ఇంతవరకు సమస్యను పట్టించుకోలేదు.

- వెంకట్రామయ్య, వైద్యాధికారి,

తంబళ్లపల్లె సీహెచసీ

Updated Date - Jul 26 , 2024 | 11:52 PM