Share News

కార్మికుల హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలి

ABN , Publish Date - Jul 24 , 2024 | 11:11 PM

కార్మికవర్గంపై దాడులు చేస్తూ, కార్మిక హక్కులు చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు పిలుపునిచ్చారు.

కార్మికుల హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలి
మాట్లాడుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు

ఫఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేసు

బి.కొత్తకోట, జూలై 24: కార్మికవర్గంపై దాడులు చేస్తూ, కార్మిక హక్కులు చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు పిలుపునిచ్చారు. బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌లో రెండురోజుల పాలు జరగనున్న ఏఐటీయూసీ అనుబంధ ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన వర్క్‌ షాప్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం వివిధ రకాలుగా పన్నులు పెంచి కార్పొరేట్‌ కంపెనీలకు లాభం చేకూరుస్తోందని ఆరోపించారు. వికసిత భారతకు 2024-25 బడ్జెట్‌ తోడ్పడుతుందని ముందుగానే ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం కార్మికవర్గానికి తీవ్ర నిరాశను మిగిల్చిందన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15వేల నేరుగా బడ్జెట్‌లో కేటాయిస్తామని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన చెప్పకపోవడం ఆంధ్రరాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనన్నారు. పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మునిసిపల్‌ కార్మికులకు సమ్మెకాలంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్‌, రాధాకృష్ణమూర్తి,రామారావు, మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన రాష్ట్ర ప్రధానకార్యదర్శి సుబ్బరాయుడు, తులశేంద్ర, రామచంద్ర, సాంబశివ, బందెలరవి, రాజేష్‌గౌడ్‌,సలీంబాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2024 | 11:11 PM