Share News

Kodali Nani: కొడాలి నాని సన్నిహితుడి పెట్రోల్ బంక్ సీజ్..

ABN , Publish Date - Jul 15 , 2024 | 12:45 PM

గుడివాడలో కల్తీ పెట్రోలు విక్రయిస్తున్న మాజీ మంత్రి కొడాలి నాని సన్నిహితుడి పెట్రోలు బంక్‌ను అధికారులు సీజ్ చేశారు. బంటుమిల్లి రోడ్డులోని షా గులాబ్ పెట్రోల్ బంక్‌లో ఏకకాలంలో తూనికలు, కొలతల శాఖ, పౌరసరఫరాల శాఖ, హెచ్‌పీసీఎల్ అధికారులు తనిఖీలు చేపట్టారు

Kodali Nani: కొడాలి నాని సన్నిహితుడి పెట్రోల్ బంక్ సీజ్..

గుడివాడ: గుడివాడలో కల్తీ పెట్రోలు విక్రయిస్తున్న మాజీ మంత్రి కొడాలి నాని సన్నిహితుడి పెట్రోలు బంక్‌ను అధికారులు సీజ్ చేశారు. బంటుమిల్లి రోడ్డులోని షా గులాబ్ పెట్రోల్ బంక్‌లో ఏకకాలంలో తూనికలు, కొలతల శాఖ, పౌరసరఫరాల శాఖ, హెచ్‌పీసీఎల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. 5 లీటర్ల కొలతతో 4 పర్యాయాలు అధికారులు పరీక్ష నిర్వహించారు. నాలుగు సార్లు కూడా కల్తీ చేస్తున్నట్టు స్పష్టమైంది. ఈ క్రమంలోనే కల్తీ బయటపడడంతో అధికారులు బంక్‌ను సీజ్ చేశారు.


మల్లాయిపాలెం పరిధిలోని ముదినేపల్లి రోడ్డులో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సన్నిహితుడు షా కీర్తికుమార్‌ జీవావత్‌కు చెందిన షా గులాబ్‌చంద్‌ జీవావత్‌ అండ్‌ కో పెట్రోలు బంకు (Petrol Bunk) ఉంది. ఈ బంకులో కల్తీ పెట్రోలు విక్రయిస్తున్నారంటూ వినియోగదారులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం 50 మందికి పైగా బైక్‌లలో 75 లీటర్ల మేర పెట్రోలు కొట్టించుకున్నారు. అవన్నీ కొద్దిదూరం వెళ్లగానే ఆగిపోయాయి. తిరిగి స్టార్ట్‌ అవ్వలేదు. షాక్ అయిన వాహనదారులు పెట్రోల్4ను చెక్ దీంతో బైక్‌లను బంకు వద్దకు తీసుకొచ్చి సిబ్బంది ఎదుట పెట్రోలు ట్యాంకులను తెరచి చూపించారు. కంపెనీ ప్రతినిధి తమ తప్పేం లేదని, పెట్రోలుతో పాటు ఇథనాల్‌ కలవకపోవడంతో వాహనాలు ఆగిపోతున్నాయని, బైక్‌కు ఏ ఇబ్బందీ ఉండదని 75లీటర్లు పెట్రోలు అమ్మకాలు జరిగాయని, తిరిగి వచ్చిన వారందరికి పవర్‌ పెట్రోలును కొట్టించి పంపుతున్నట్లు తెలిపారు. మరికొందరు పాత ద్విచక్రవాహనదారులు వాహనం ఎందుకు ఆగిందో తెలియక మెకానిక్‌లను ఆశ్రయించారు. ట్యాంకు నుంచి పెట్రోలును తీసి కల్తీపెట్రోలు కారణంగానే ఆగిపోయాయని, నెలలో రెండోసారి వాహనాల ట్యాంకులను శుభ్రపరిచామని మెకానిక్‌లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Rohit Sharma: రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Nita Ambani: మీడియాకు క్షమాపణలు తెలిపిన నీతా అంబానీ.. కారణమిదే

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 15 , 2024 | 12:45 PM