Share News

Chandrababu Oath: బాహుబలి రేంజ్‌లో చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు!

ABN , Publish Date - Jun 10 , 2024 | 01:24 PM

అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. వేదిక నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు ఎనిమిది అడుగుల ఎత్తుతూ స్టేజి సిద్ధం చేశారు.

Chandrababu Oath: బాహుబలి రేంజ్‌లో చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు!

అమరావతి: తెలుగుదేశం అధినేత (TDP Chief) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారోత్సవ సభ (Swearing-in Ceremony) ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. వేదిక నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు ఎనిమిది అడుగుల ఎత్తుతూ స్టేజి సిద్ధం చేశారు. జర్మన్ హాంగర్స్‌తో భారీ టెంట్‌ను ఏర్పాటు చేశారు. వచ్చే అతిథులు, వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. వచ్చే అతిధులు, వీఐపీలు కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీ.. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీ కుటుంబ సభ్యులకు కోసం ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు. స్థల ప్రభావం వల్ల పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతి ఇస్తారు. కాగా గన్నవరం జాతీయ రహదారిపక్కన, వెటర్నరీ కళాశాల, కేసరపల్లి మేధా టవర్స్‌ లే ఔట్‌లో ఎంపిక చేసిన పార్కింగ్ ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు తదితర ప్రముఖులకు పార్కింగ్ స్థలాన్ని ఎంపిక చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హీరోలుగా ఉన్న ఆ నేతలు ఇప్పుడు జీరోలు..

కేబినెట్‌ బెర్త్‌లపై ఆ ఎమ్మెల్యేల ఆశలు..

ఆ జిల్లాలో వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..

శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు

బరిలోకి బాబు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 10 , 2024 | 01:46 PM