Share News

బాధ్యతాయుతంగా పోలింగ్‌ విధులు నిర్వహించాలి

ABN , Publish Date - May 09 , 2024 | 01:15 AM

పోలింగ్‌ విధులను బాధ్య తాయుతంగా నిర్వహించి, ఎన్నికల ప్రక్రియ విజ యవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ పీఓలు, ఏపీఓలకు సూచిం చారు. మండలంలోని తేలప్రోలు ఉషారామా ఇంజ నీరింగ్‌ కళాశాలలో బుధవారం 71-గన్నవరం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు ఎన్నికల నియమావళి, విధులపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

 బాధ్యతాయుతంగా పోలింగ్‌ విధులు నిర్వహించాలి
పోలింగ్‌ నిర్వహణ ప్రక్రియపై పీఓలు, ఏపీఓలకు సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ డీకే బాలాజీ

ఉంగుటూరు, మే 8 : పోలింగ్‌ విధులను బాధ్య తాయుతంగా నిర్వహించి, ఎన్నికల ప్రక్రియ విజ యవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ పీఓలు, ఏపీఓలకు సూచిం చారు. మండలంలోని తేలప్రోలు ఉషారామా ఇంజ నీరింగ్‌ కళాశాలలో బుధవారం 71-గన్నవరం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు ఎన్నికల నియమావళి, విధులపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ పోలింగ్‌ నిర్వహణలో పీఓలు, ఏపీఓలు తెలుసుకో వాల్సిన ముఖ్యాంశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ నిర్వ హణ, విధుల పట్ల ఎన్నికల సిబ్బంది అవగాహన పెంచుకోవటం ద్వారా పోలింగ్‌ ప్రక్రియను సులభంగా నిర్వహించవచ్చన్నారు. ప్రిసైడింగ్‌ అధికారులు ఎన్నికల హ్యాండ్‌ బుక్‌ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలని, తద్వారా ఎన్నికల నిబంధనలపట్ల అవగాహన కలిగి పోలింగ్‌ ప్రక్రి యలో పొరపాట్లకు ఆస్కారం లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. రిసెప్షన్‌ సెంటర్‌కు సకాలంలో చేరుకోవాలన్నారు. అనవసర కారణా లతో విధుల నుంచి మినహాయింపులు కోరవద్దని, సహేతుకమైన కారణం వుంటే మినహాయింపు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, గన్నవరం నియోజకవర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ గీతాంజలి శర్మ, గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్‌ మండలాల తహసీల్దార్లు ఎన్‌.ఎస్‌.పవన్‌ కుమార్‌, జేవీ సుబ్బారావు, ఏ.శ్రీనివాసరావు, కె.జాహ్నవి, సెక్టోరియల్‌ ఆఫీసర్లు ఎం.అమీర్‌బాషా, ఎం.సురేష్‌, వీవీఎస్‌ఆర్‌ఎస్‌ హరీష్‌కుమార్‌, జె.సాంబశివరావు, రిసోర్స్‌పర్సన్లు, రెవెన్యూ సిబ్బంది, పీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 01:15 AM