Share News

CM Chandrababu: ఏపీ విజన్ డాక్యుమెంట్ అక్టోబర్ 2న విడుదల..

ABN , Publish Date - Aug 05 , 2024 | 12:28 PM

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సచివాలయంలోని 5 వ బ్లాక్‌లో కలెక్టర్లతో సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఏపీ విజన్ డాక్యుమెంట్‌ను అక్టోబర్ 2న విడుదల చేస్తామని, కలెక్టర్‌లు ఆఫీసులో మాత్రమే కాకుండా ఫీల్డ్ విజిట్ కూడా చేయాలని సూచించారు. క్షేత్ర స్ధాయిలో ఏం జరుగుతుందో అందరూ తెలుసుకోవాలన్నారు.

CM Chandrababu: ఏపీ విజన్ డాక్యుమెంట్ అక్టోబర్ 2న విడుదల..

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సచివాలయంలోని 5 వ బ్లాక్‌లో కలెక్టర్లతో సమావేశం (Collectors Meeting) జరుగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం (Kutami Govt.,) అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి భేటీ ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఏపీ విజన్ డాక్యుమెంట్‌ను (AP Vision Document) అక్టోబర్ 2న విడుదల (October 2nd Released) చేస్తామని, కలెక్టర్‌లు ఆఫీసులో మాత్రమే కాకుండా ఫీల్డ్ విజిట్ (Field Visit) కూడా చేయాలని సూచించారు. క్షేత్ర స్ధాయిలో ఏం జరుగుతుందో అందరూ తెలుసుకోవాలన్నారు. గ్రామంలోకి వెళితే పెద్దపెద్ద సభలు వద్దని, తాను కూడా త్వరలో ఆకస్మిక తనికీలు చేస్తానని చెప్పారు.


హైదరాబాద్‌ను అభివృద్దిని చేసింది ఆఫీసర్లేనని.. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మేము మీతో పనిచేయించాలి.. మూమే పనిచేయాలి అంటే కుదరదని సీఎం చంద్రబాబు అన్నారు. ఒకప్పడు డ్రైన్‌లలో ఐఏఎస్ ఆఫీసర్లను దించిన రోజులు కూడా ఉన్నాయన్నారు. తరువాత అంత కఠినంగా తాము పోలేదు... హైదరాబాద్‌ను కూడా మీరే బిల్డ్ చేశారని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కనీస అవసరాలు అందరికి అందిచే విషంయంలో ఓ క్లారిటీ రావాలన్నారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంటులు తెస్తే రెండు అందుబాటులోకి వచ్చాయని అయితే వాటిని డిస్మాంటిల్ చేశారన్నారు. హెడ్ క్వార్టర్‌కు రోడ్లు, కనెక్టివిటీ, పోర్టుల వృద్ది చేయాలని, వాటితోపాటు టూరిజానికి కూడా ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు.


ఎంత పెట్టుబడి పెట్టామనేదానికంటే ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయన్నదే ముఖ్యమని, డెమెగ్రాఫిక్స్ మేనేజ్‌మెంట్ చేయడం ఎంతో అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. లింకింగ్ ఆఫ్ రివర్స్ అనేది మన రాష్ట్రంలో అయినా చేయగలగాలని.. అప్పడు కరవు రహిత రాష్ట్రాన్ని చూడగలుగుతామని అన్నారు. స్కిల్ సెన్సెస్ ఇదికోర్ ప్రోగ్రాం లాస్ట్‌కు వచ్చేసరికి జిల్లా, మండల లెవల్ జీఎస్‌డీపీ కూడా తీస్తామని, వర్క్ హర్డ్, వర్క్ స్మార్ట్ , థింక్ గ్లోబల్లీ ఉండాలని, కలెక్టర్లు అందరికి చెపుతున్నామని, వారి కేరియర్ బాగుండాలి.. వారు ఎంత చేస్తే అంత ఎంకరేజ్ చేస్తాం... ఆల్ ది బెస్ట్ టూ కలెక్టర్స్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ కాన్ఫరెన్స్ చరిత్రాత్మకమైనది: సీఎం చంద్రాబాబు

షర్మిలపై నెల్లూరు కాంగ్రెస్‌ నేతల ఫైర్‌..

వంశీకి లుక్ అవుట్ నోటీసులు జారీ..

తెలంగాణకు భారీ పెట్టుబడులు..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 05 , 2024 | 12:28 PM