Home » Vijayawada
సైబర్ నేరగాళ్లను బురిడీ కొట్టించాడో ఉద్యోగి. కొరియర్ ట్రాకింగ్ కోసం కాల్ చేయడంతో.. సైబర్ నేరగాళ్లు లైన్లోకి వచ్చారు. ఓటీపీ చెప్పాలని కోరారు. అనుమానం వచ్చి బ్యాంక్‌కు వెళ్లి క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయాలని కోరారు.
ప్రపంచ స్థాయి ఐటి పాలసీతో నాలెడ్జ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా ఉంచే భాగస్వామ్యాల కోసం ఎదురు చూస్తున్నామన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం రాత్రి GCCలు, HTD భాగస్వాములు CXOలతో సీఎం భేటీ అయ్యారు. ఫలవంతమైన చర్చ జరిగిందని సమావేశం అనంతరం ఆయన ట్వీట్ చేశారు.
శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారిని శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి శంకరాచార్య విధుశేఖర భారతి స్వామీజీ మంగళవారం దర్శించుకున్నారు. శ్రీ శృంగేరి పీఠాధిపతికి దుర్గ గుడి ఈవో రామారావుతోపాటు పురోహితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్‌గా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రమాణస్వీకారం చేశారు.
మహిళల భద్రతకు పెద్దపీట అని ఆర్భాటపు ప్రచారాలు తప్ప10 ఏళ్లలో ఏ ఒక్క నేరస్థుడికీ కఠిన శిక్ష పడలేదని వైఎస్ షర్మిల అన్నారు. కేసులు ఛేదించాల్సిన పోలీసులను కక్ష్యసాధింపు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
జగన్‌ను చూసి చాలా రోజులు అవుతుంది.. కానీ ఆయన మాత్రం అసెంబ్లీకి రావడం లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే.. రోజుకు జగన్‌కు గంట మాట్లాడేందుకు సమయం ఇస్తే వస్తారన్నారు. ఇంకొ విషయం ఏంటంటే.. ఆయన ఏం మాట్లాడినా అద్దం రాకూడదని.. ఇది జగన్ ఫిలాసఫీ అని అన్నారు.
వైసీపీ పాలనలో మైనింగ్ శాఖను మడత పెట్టేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డికి బెయిల్ లభించింది.
Andhrapradesh: భారతదేశం ముక్కలు కాకుండా , దేశ సమైక్యత కోసం చండ్రా రాజేశ్వరరావు కృషి చేశారని నారాయణ తెలిపారు. చివరి రోజుల్లో ఆయన ఆరోగ్యం బాగా క్ణీణించిందన్నారు. చనిపోవడానికి మెరుక్యూ ఇంజక్షన్ అడిగితే... కమిటీ అంగీకరించ లేదన్నారు. యన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కొండాపూర్‌లో ఐదు ఎకరాలు కేటాయించారని..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాల్గవ రోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముుందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ప్రశ్నోత్తరాల అనంతరం వార్షిక బడ్జెట్‌పై చివరి రోజు చర్చ కొనసాగనుంది. తర్వాత ప్రభుత్వం సభలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టనుంది.
విజయవాడలో ఉమామహేశ్వరశాస్త్రి అనే వ్యక్తికి విలువైన స్థలం ఉంది. దానిపై వైసీపీ రాష్ట్రస్థాయి నేత గౌతమ్ రెడ్డి కన్నుపడింది. దీంతో అతని స్థలం కబ్జా చేసి బెదిరింపులకు దిగాడు గౌతమ్ రెడ్డి. స్థలం తనకు ఇచ్చేయాలని, లేకుంటే ప్రాణాలు తీస్తానని పలుమార్లు హెచ్చరించాడు.