Narayana: ఉద్యమ స్ఫూర్తిని నింపిన వ్యక్తి సీఆర్
ABN , Publish Date - Nov 16 , 2024 | 01:12 PM
Andhrapradesh: భారతదేశం ముక్కలు కాకుండా , దేశ సమైక్యత కోసం చండ్రా రాజేశ్వరరావు కృషి చేశారని నారాయణ తెలిపారు. చివరి రోజుల్లో ఆయన ఆరోగ్యం బాగా క్ణీణించిందన్నారు. చనిపోవడానికి మెరుక్యూ ఇంజక్షన్ అడిగితే... కమిటీ అంగీకరించ లేదన్నారు. యన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కొండాపూర్‌లో ఐదు ఎకరాలు కేటాయించారని..
విజయవాడ, నవంబర్ 16: చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రజతోత్సవ సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Leader Narayan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చండ్ర రాజేశ్వరరావు ఎందరిలోనో ఉద్యమ స్పూర్తిని నింపారన్నారు. దున్నే వారిదే భూమి అన్న నినాదంతో పోరాడారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పని చేశారన్నారు. లక్షలాది మంది ఎర్ర సైన్యాన్ని తయారు చేశారని తెలిపారు. చండ్ర రాజేశ్వరరావు ఒక లెజండ్రీ అంటూ కొనియాడారు.
AP Assembly: సభలో జగన్‌పై విరుచుకుపడ్డ విష్ణుకుమార్ రాజు
భారతదేశం ముక్కలు కాకుండా , దేశ సమైక్యత కోసం కృషి చేశారని తెలిపారు. చివరి రోజుల్లో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందన్నారు. చనిపోవడానికి మెరుక్యూ ఇంజక్షన్ అడిగితే... కమిటీ అంగీకరించ లేదన్నారు. యన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కొండాపూర్‌లో ఐదు ఎకరాలు కేటాయించారని.. అక్కడ వృద్దుల ఆశ్రమం ఇప్పుడు నడుపుతున్నారని చెప్పారు. 145 మంది వృద్దులు ఇప్పుడు అక్కడ ఉన్నారన్నారు. మహిళలకు ఉచిత శిక్షణ కేంద్రం నడుపుతున్నారని చెప్పారు. సీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని నారాయణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Adireddy Srinivas:ఆదిరెడ్డి భవానిపై ట్రోల్స్..ఆదిరెడ్డి వాసు వార్నింగ్
AP: ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి సర్చ్ వారెంట్.. ఏ క్షణంలోనైనా..
Read Latest AP News ANd Telugu News