Share News

Chandrababu: సచివాలయంలో సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు

ABN , Publish Date - Jul 10 , 2024 | 10:25 AM

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌పై సమీక్షించనున్నారు. అలాగే ఆర్థిక శాఖ వైట్ పేపర్‌పై రివ్యూ చేయనున్నారు. తర్వాత ఎక్సైజ్ శాఖ, మద్యం శ్వేతపత్రంపై కూడా సమీక్ష జరపనున్నారు.

Chandrababu: సచివాలయంలో సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) బుధవారం సచివాలయం (Secretariat)లో కీలక సమీక్షలు (Key reviews) నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌ (Finance Dept.,)పై సమీక్షించనున్నారు. అలాగే ఆర్థిక శాఖ వైట్ పేపర్‌పై రివ్యూ చేయనున్నారు. తర్వాత ఎక్సైజ్ శాఖ (Excise Dept.,), మద్యం (Liquor) శ్వేతపత్రంపై కూడా సమీక్ష జరపనున్నారు.


ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం (AP Assembly Sessions Begin) కానున్నాయి. ఐదు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Governor Justice Abdul Nazir) ప్రసంగిస్తారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం జరుగుతుంది. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేని కారణంగా మరో మూడు నెలలపాటు తాత్కాలిక బడ్జెట్ కోసం ఈ సమావేశాల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.


కాగా ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసే ఛాన్స్ ఉంది. మరో 4 నెలల పాటు ఓటాన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టు సమాచారం. కొంచెం ఆర్థిక వెసులుబాటు, వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత రావడానికి మరి కొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. వాటిపై స్పష్టత వచ్చాక సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక శాఖ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. కాగా ఆర్డినెన్స్ పెట్టాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురు చూస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతి భవనాలపై సీఆర్డీఏ కీలక నిర్ణయం

రైతు భరోసా అమలుకు శ్రీకారం..

విద్యుత్ రంగంలో 3.0 విధానం: సీఎం

సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ఫైర్..

బాసరలో ముదురుతున్న బీజాక్షరాల వివాదం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 10 , 2024 | 11:27 AM