Share News

ప్రైౖవేట్‌ బస్సుల దోపిడీని అరికట్టాలి

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:22 AM

రాష్ట్రంలో ప్రైవేట్‌ బస్సుల దోపిడీని అరిక ట్టాలని రవాణా మంత్రి రాంప్రసాద్‌ రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య కోరారు.

ప్రైౖవేట్‌ బస్సుల దోపిడీని అరికట్టాలి

  • మంత్రి రాంప్రసాద్‌ రెడ్డికి సీపీఐ నేత ఈశ్వరయ్య వినతి

బస్సుస్టేషన్‌, జూలై 26: రాష్ట్రంలో ప్రైవేట్‌ బస్సుల దోపిడీని అరిక ట్టాలని రవాణా మంత్రి రాంప్రసాద్‌ రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య కోరారు. విజయవాడలోని మంత్రి నివాసంలో శుక్ర వారం ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. విమానచార్జీలకు దీటుగా ప్రైవేట్‌ బస్సులు చార్జీలు వసూలు చేస్తున్నాయని, రవాణాశాఖ అనుమతులు లేనప్పటికీ పలు సర్వీసులు నడుస్తున్నాయని మంత్రి దృష్టికి ఈశ్వరయ్య తెచ్చారు. విజయవాడ నుంచి కడపకు రూ.1900 చార్జీ వసూలు చేస్తున్నారని తెలిపారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో ఏ బస్సు ఎక్కినా రూ.1000కి పైనే చార్జీలు ఉంటున్నాయని, వారాంతాలు, సంకారంతి వంటి పండుగ రోజుల్లో ట్రావెల్స్‌ దోపిడీకి అంతే ఉండదన్నారు. గతంలో ఆర్టీఏ అఽధికారులు దాడులు చేసే వారని, ఇప్పుడు వారి పేరుపైనే ఉచిత టికెట్లు రిజర్వ్‌ అవుతున్నాయని మం త్రికి తెలిపారు. నెలవారీ మామూళ్లు కూడా యాజమాన్యాలు ముట్టచెబు తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయని వివరించారు.

Updated Date - Jul 27 , 2024 | 08:23 AM