Share News

గ్రామాల అభివృద్ధి చంద్రబాబుతోనే

ABN , Publish Date - May 09 , 2024 | 01:13 AM

గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే సాధ్యమని గన్నవరం నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం బాపులపాడు లో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

 గ్రామాల అభివృద్ధి చంద్రబాబుతోనే
బాపులపాడులో ప్రచారం నిర్వహిస్తున్న వల్లభనేని బాలశౌరి, యార్లగడ్డ వెంకట్రావు

హనుమాన్‌జంక్షన్‌/ గనవరం, మే 8 : గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే సాధ్యమని గన్నవరం నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం బాపులపాడు లో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో పాల్గొన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే చంద్ర బాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బందరుపోర్టు అభి వృద్ధికి వల్లభనేని బాలశౌరిని, గన్నవరం నియోజకవర్గ అభివద్ధితో పాటు మల్లవల్లి పారిశ్రామికవాడ పురోగతి చెందడానికి యార్లగడ్డ వెంకట్రావు గెలుపు అవసరం అన్నారు. సుంకర సుభాష్‌చంద్రబోస్‌, నూలు నరసింహారావు, చలమలశెట్టి రమేష్‌బాబు ఉన్నారు.

గన్నవరం మండలంలోని చనుపల్లివారిగూడెం, మాదలవారిగూడెంలో బుధవారం రాత్రి కూటమి అభ్యర్థులు యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని బాలశౌరి లను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్దరబోయిన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో జాతీయ స్థాయిలో అభివృద్ధి అనేది లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనన్నారు. కేంద్రం నుంచి విడుదలైన 14,15వ ఆర్ధిక సంఘం నిధులను సైతం దారి మళ్లించి గ్రామీణ ప్రాంతాల అభివృద్దిని కాలరాసిందన్నారు. పంచాయతీ లకు పూర్వ వైభవం రావాలంటే యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీకి వెళ్లాల న్నారు. అందుకు ప్రజలంతా సైకిల్‌, గాజు గ్లాసు గుర్తులపై ఓట్లు వేయాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, రామినీడు బసవపూర్ణయ్య, పిన్నిబోయిన సీతారామయ్య, కూచిపూడి సుబ్బయ్య, నల్లజర్ల బెంజెమిన్‌, పిన్నిబోయిన తిరుపతిరావు, తుల్లిమిల్లి ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధి యార్లగడ్డతోనే

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: అరాచకపాలన అంత మొంది అభివృద్ధితో పాటు పేదలకు సంక్షేమ పథకాలుసకాలంలో అందాలంటే టీడీపీ కూటమికి ఓటు వేయాలని టీడీపీ గ్రామ నాయకుడు కొండ పావులూరి నాని అన్నారు. ఓగిరాలలో బుధవారం టీడీపీ కూటమి అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారంలో భాగంగా టీడీపీ మహిళలు బొట్టుపెట్టి ఓటు అభ్యర్థించారు. సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలికసదుపాయాల కల్పనకు టీడీపీ కూటమికి మద్దతు పలకాలని కోరారు. గాజుగ్లాసు, సైకిల్‌ గర్తుకు ఓటువేయాలని కోరారు. ప్రచారంలో పండమ్మ, నళిని, రాధిక, పార్వతి, కృష్ణవేణి, అన్నమ్మ, భవాని, రత్న పాల్గొన్నారు.

మోడల్‌ ఈవీఎంలతో వేలేరులో ప్రచారం

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు సకాలంలో అందాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే సాధ్యమని టీడీపీ, జనసేన నాయకులు వివరించారు. వేలేరులో తెలుగురైతు రాష్ట్ర నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు, జనసేన మండల ఉపాధ్యక్షుడు భూక్యా సమీర్‌నాయక్‌ బుధవారం మోడల్‌ ఈవీఎంలతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మోడల్‌ ఈవీఎంలలో బందరు పార్లమెంటు అభ్యర్థికి గాజుగ్లాసు గుర్తు, గన్నవరం అసెంబ్లీ నియో జకవర్గ అభ్యర్థికి సైకిల్‌ గుర్తుకు ఓటు ఎలా వేయాలో సోదాహరణంగా చూపించారు. ఈ కార్యక్రమంలో అవిర్నేని భవానీ శంకర్‌, సుబ్బారావు, బాణావతుల స్వామి, రామారావు, విజయరాజు, రవీంద్ర, సుధీర్‌, భూక్యా కృష్ణ, గౌస్‌ పాల్గొన్నారు.

చంద్రబాబుతోనే పారిశ్రామిక ప్రగతి

ఉంగుటూరు: వైసీపీ పాలనలో మూతపడ్డ పరి శ్రమలను తెరిపించడంతో పాటు నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయడం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం చంద్రబాబుతోనే సాధ్యమని, పారిశ్రామిక ప్రగతిపై పూర్తి విజనరీ కలిగిన ఆయన్ని సీఎంగా గెలిపించడం ద్వారా యువత ఉజ్వల భవితకు భరోసా వుంటుందని గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సోదరుడు సతీష్‌ అన్నారు. వెంకట్రావును గెలిపించా లని కోరుతూ, లంకపల్లి, ఓండ్రంపాడులో గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కైలే సర్వేశ్వరరావు, రంగారావు, ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి, ఆళ్ల హనోక్‌, శ్రీమన్నా రాయణ, వాసు, దోనేపూడి వెంకటేశ్వరరావు, రాంబాబు, రమేష్‌ జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 01:13 AM