Share News

హెల్మెట్‌తో ప్రాణాలకు భద్రత

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:44 AM

రోడ్లపై ద్విచక్రవాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలకు భద్రత కల్పిస్తుందని తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జీవీకేఎస్‌వీ ప్రసాద్‌ అన్నారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు హెల్మెట్‌ ఉపయోగంపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.

 హెల్మెట్‌తో ప్రాణాలకు భద్రత
హెల్మెట్‌ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు

ఉంగుటూరు, జూలై 26 : రోడ్లపై ద్విచక్రవాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలకు భద్రత కల్పిస్తుందని తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జీవీకేఎస్‌వీ ప్రసాద్‌ అన్నారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు హెల్మెట్‌ ఉపయోగంపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. సేప్టీ ఫస్ట్‌ హెల్మెట్‌ మస్ట్‌, హెల్మెట్‌ ధరించండి, సురక్షితం గా ఇంటికి చేరండి, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నా, అందుకే హెల్మెట్‌ ధరిస్తున్నా అనే నినాదాలతో స్థానిక కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన జాతీయ రహదారి మీదుగా పొట్టిపాడు వరకు కొనసాగింది. ఎన్‌ఎస్‌ ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ వి.శ్రీహరిబాబు మాట్లాడుతూ, హెల్మెట్‌ వాడకంపై ద్విచక్రవాహనదారులు అవగాహన కలిగివుండాలన్నారు. ఆగస్టు 1నుంచి హెల్మెట్‌ ధరించకుండా బైక్‌లు నడిపితే వెయ్యిరూపాయల జరిమానా తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ అండర్‌ ఆఫీసర్‌ ఎం.భాను పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:44 AM