Share News

CM Chandrababu: ఏపీలో నూతన మద్యం విధానం అమలు..

ABN , Publish Date - Jul 31 , 2024 | 11:35 AM

అమరావతి: ఏపీలో మద్యం కొత్త విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే లిక్కర్ పాలసీపై ప్రాథమిక ప్రతిపాదనలను ఎక్సైజ్ శాఖ రూపొందించింది.

CM Chandrababu: ఏపీలో నూతన మద్యం విధానం అమలు..

అమరావతి: ఏపీ (AP)లో మద్యం కొత్త విధానంపైn (Liquor new Policy) ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ (CM Chandrababu Govt.,) దృష్టి పెట్టింది. వైసీపీ (YCP) ప్రభుత్వం లో మద్యం కుంభకోణం (Liquor scam) జరిగినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం (Kutami Govt.,) నూతన మద్యం విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే లిక్కర్ పాలసీపై ప్రాథమిక ప్రతిపాదనలను ఎక్సైజ్ శాఖ రూపొందించింది. అబ్కారి శాఖ ప్రతిపాదనలపై బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహంచనున్నారు. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం మద్యం విధానం సెప్టెంబర్ చివరి నాటికి ముగియనుంది. లిక్కర్ బాటిల్స్‌కు నకిలీ హోలోగ్రాం సీల్ విషయంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.


కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రెండు కీలక శాఖలపై సమీక్ష నిర్వహించబోతున్నారు. ఒకటి పరిశ్రమలు, రెండవది ఎక్సైజ్ శాఖలకు సంబంధించి సమీక్షించనున్నారు. పరిశ్రమలకు సంబంధించినంతవరకు పెట్టుబడులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి అధికారులకు దిశ నిర్దేశం చేయనున్నారు. గత ప్రభుత్వం అసంబద్ధ విధానం వల్ల ఏపీ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పించే అంశంపై కూడా సీఎం చర్చించనున్నారు. పారిశ్రామిక వేత్తలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఈ సమీక్ష సమావేశం ఇవాళ మధ్యాహ్నం 12 గంలకు ప్రారంభం కానుంది.


సాయంత్రం నాలుగు గంటలకు కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నూతన ఎక్సైజ్ పాలసీ రూపొందించాలని నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన పాలసీ ప్రతిపాదనలను ఆ శాఖ సిద్ధం చేసింది. అవన్నీ చంద్రబాబు ముందు ఉంచనుంది. అక్టోబర్ నాటికి మద్యం కొత్త పాలసీ రూపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం ప్రాథమికంగా జరుగుతున్నట్లు భావించాల్సి ఉంటుంది. పాత విధానంలో ఉన్న లోపాలను సరి చేయడంతోపాటు ప్రైవేట్ మద్యం దుకాణాలకు పర్మిషన్లు ఇవ్వాలా..? వద్దా అనే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం, హోలోగ్రామ్ స్టిక్కర్ల స్కాంపై కూడా ఇవాళ సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు దీనికి సంబందించి పూర్వపరాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో ఆ నివేదికలను తెప్పించుకుని ముఖ్యమంత్రి చర్చించే అవకాశముంది. మద్యం నియంత్రణకు సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలని చంద్రబాబు ఈ సమీక్షలో నిర్ణయం తీసుకోనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Live..: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

నామినేటెడ్ పోస్టులు వారికే: సీఎం చంద్రబాబు

గవర్నర్‌గా నేడు జిష్ణు దేవ్ వర్మ ప్రమాణస్వీకారం

బినామీ పేర్లతో పెద్దిరెడ్డి భూముల రిజిస్ట్రేషన్‌..

మద్యం బాటిళ్లకు నకిలీ హోలోగ్రాం స్టిక్కర్లు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 31 , 2024 | 12:32 PM