Share News

జోగివి దిగజారుడు రాజకీయాలు

ABN , Publish Date - May 09 , 2024 | 01:17 AM

జోగి దిగజారుడు రాజకీ యాలను ప్రజలు తిప్పికొట్టాలని పెనమలూరు నియోజక వర్గ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ అన్నారు. పెన మలూరు మండలంలోని గోసాల, గంగూరు, కంకి పాడు మండలంలోని ఈడుపుగల్లు కాలువకట్ట, పునాదిపాడులో బుధవారం నిర్వహిం చిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

 జోగివి దిగజారుడు రాజకీయాలు
పునాదిపాడు ఎన్నికల ప్రచారంలో బోడె ప్రసాద్‌

కంకిపాడు, మే 8 : జోగి దిగజారుడు రాజకీ యాలను ప్రజలు తిప్పికొట్టాలని పెనమలూరు నియోజక వర్గ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ అన్నారు. పెన మలూరు మండలంలోని గోసాల, గంగూరు, కంకి పాడు మండలంలోని ఈడుపుగల్లు కాలువకట్ట, పునాదిపాడులో బుధవారం నిర్వహిం చిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పెనమలూరు నియో జక వర్గంలో వైసీపీ అభ్యర్థిగా వచ్చిన జోగి రమేష్‌, ఆయన కుమారులు నియో జకవర్గంలో రౌడీ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జోగికి పెనమలూరు నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. గంగూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్యారీల దీఫ్‌, ఇర్ఫాన్‌, అబ్దుల్‌ సలాం, దేవినేని రాజా, కోయా ఆనంద్‌, అనుమోలు ప్రభాకర్‌, సెంగెపు రంగారావు, వెలగపూడి శంకర బాబు, కుర్రా నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. గోసాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాబు సుబాని, ఆంజనేయులు, కోనేరు సాంబ శివరావు తదితరులు పాల్గొన్నారు. పునాదిపాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సుదిమళ్ల రవీం ద్ర, కాసరనేని కరుణ, మద్దాలి రామచంద్రరావు, అనుమోలు శ్రీను, జంపన వెంకటేశ్వరరావు, ముసు బోయిన బాబు, కవిరి సంజీవ్‌, నాగరాజు, వెంకటే శ్వరరావు, మద్దాలి సాయిబాబు, వేముల అంకా రావు, కర్రా కిషోర్‌, రాజేష్‌, రవి, వేముల వెంకట్‌, చిన్న గోపి, బాబి తదితరులు పాల్గొన్నారు. పునాదిపాడు బీసీ కాలనీలో మహిళలు బోడె ప్రసాద్‌కు ఘనస్వాగతం పలికారు.

సూపర్‌సిక్స్‌ పథకాలతో ఎంతో మేలు

ఉయ్యూరు : చంద్రబాబునాయుడు ప్రకటిం చిన సూపర్‌సిక్స్‌ పథకాలతో బడుగు, బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలకు ఎంతో మేలు కలుగు తుందని బోడె వెంకట్రామ్‌ అన్నారు. కూటమి పెన మలూరు అసెంబ్లీ, మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్య ర్థులు బోడె ప్రసాద్‌, వల్లభనేని బాలశౌరికి మద్ధతు గా బుధవారం ఉయ్యూరు 5, 16వ వార్డుల్లో పర్యటించి సైకిల్‌, గాజుగ్లాసు గుర్తు లకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో పార్టీ నాయకులు జంపాన పూర్ణచంద్ర రావు, వాసు, గుర్నాధరావు, రాజులపాటి ఫణి, చలపాటి శ్రీను, సుబ్బారావు, సంతోశ్‌ పాల్గొన్నారు.

పెదఓగిరాలలో పార్టీ నాయకులు బత్తుల కామేశ్వర రావు, బండి కృష్ణబాబు, నాగేశ్వరరావు, జల్లె కోటేశ్వరరావు కూటమి అభ్యర్థులకు మద్దతు గా పెదఓగిరాల ఎస్సీకాలనీలో ప్రచారం నిర్వహిం చారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు జరిగిన అన్యా యాలు, వారిపై జరిగిన దాడులు, అరాచకాలు వివరించి కూటమి అభ్యర్థులైన బోడె ప్రసాద్‌, బాలశౌరికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.

Updated Date - May 09 , 2024 | 01:17 AM