Share News

కాంగ్రెస్‌ నేత ఎల్లయ్య హత్య కేసులో.. కీలక మలుపు

ABN , Publish Date - May 09 , 2024 | 01:14 AM

రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య (58) హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండల పరిధిలోని బండిపాలెం ఫారెస్టు ప్రాంతంలో బుధవారం జగ్గయ్యపేట పోలీసులు ఎల్లయ్య మృతదేహాన్ని సగం కాలి, చిక్కి శల్యమైన స్థితిలో గుర్తించారు.

కాంగ్రెస్‌ నేత ఎల్లయ్య హత్య కేసులో.. కీలక మలుపు
బండిపాలెం వద్ద ఫారెస్టులో కప్పి పెట్టిన ప్రదేశం, సగం కాలిన ఎల్లయ్య మృతదేహం

జగ్గయ్యపేట, మే 8 : రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య (58) హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండల పరిధిలోని బండిపాలెం ఫారెస్టు ప్రాంతంలో బుధవారం జగ్గయ్యపేట పోలీసులు ఎల్లయ్య మృతదేహాన్ని సగం కాలి, చిక్కి శల్యమైన స్థితిలో గుర్తించారు. మంగళవారం బండిపాలెం గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు, పశువుల కాపరులు ఫారెస్టులో ఏదో శవం దుర్వాసన వస్తున్నదని గ్రామపెద్దలకు చెప్పటంతో వీఆర్వో బాబూరావు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బుధవారం ఉదయం జగ ్గ య్యపేట సీఐ జానకీరాం సిబ్బందితో కలిసి వెళ్లి ఆ ప్రాంతంలో తవ్వించగా సగం కాలి, చిక్కి శల్యమై గుర్తించలేని స్థితిలో ఉన్న శవం బయటపడింది. సూర్యాపేటలో ఉన ్న ఎల్లయ్య కుటుంబసభ్యులు, బంధువులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఎల్లయ్య దేనని గుర్తించారు. ఎల్లయ్య మృతదేహానికి అక్కడే రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించగా, జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రి వైద్యులతో పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించారు.

గత ఏప్రిల్‌ 18న సూర్యాపేట నుంచి అపర్ణ, శ్రీనివాస్‌ అనే దంపతుల పంచాయితీకి వచ్చి కనిపించకుండా పోయినట్టు ఎల్లయ్య సోదరుడు సతీష్‌ జగ్గయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేశారు. అప్పటికే ఎల్లయ్యపై పలు హత్యకేసులతో పాటు 18 కేసులు ఉండటంతో ఆయన ప్రత్యర్థులు ప్రతీకారం తీర్చుకుని ఉంటారని పోలీసులు భావించారు. ఎల్లయ్య తనతోపాటు పంచాయితీకి కోదాడకు చెందిన మొగిలిచర్ల అంజయ్య అనే స్నేహితుడిని తీసుకుని రావటంతో అదృశ్యం వ్యవహారం బట్టబయలైంది. శ్రీనివాస్‌ డబ్బులు ఇస్తానని ఎల్లయ్యను తీసుకెళ్లటం, అపర్ణ వాష్‌రూంకి వెళ్లాలని చెప్పి కనిపించకుండా పోవటం, ఆ తర్వాత శ్రీనివాస్‌, అపర ్ణ, ఎల్లయ్యల మొబైల్స్‌ స్విచ్చాఫ్‌ కావటంతో అంజయ్యకు అనుమానం వచ్చి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా జగ్గయ్యపేట, సూర్యాపేట పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. అంజయ్య ఇచ్చిన సమాచారంతో జగ్గయ్యపేటలో రైల్వే స్టేషన్‌రోడ్డులో ఒక ఇల్లు ఎల్లయ్య హత్యకు ఉపయోగించినట్టు పోలీసులు గుర్తించారు. ఎల్లయ్యను నమ్మకంగా తీసుకెళ్లి కళ్లలో కారం చల్లి రాడ్‌తో కొట్టి హత్య చేసినట్టుగా పోలీసులకు సాఽక్ష్యాధారాలు లభించా యి. ఎల్లయ్య శవం దొరక్కపోవటం నిందితులు కొత్త సిమ్‌లు, ఫోన్‌లు ఉపయోగించి మాట్లాడి, అనంతరం వాటిని ఆపేయటంతో రెండు రాష్ట్రాల పోలీసులకు ఎల్లయ్య కేసు సవాల్‌ గా మారింది. రెండు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా 9 బృందాలుగా ఏర్పడి నిందితులు, ఎల్లయ్య శవం కోసం గాలించారు. జగ్గయ్యపేటలో కృష్ణా పరివాహక ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో డ్రోన్‌ కెమెరాలతో కూడా అన్వేషణ చేసినా ఫలితం లేకపోయింది. గత నెల 25న జగ్గయ్యపేట జాతీయ రహదారిపై కొణకంచి ఎల్లయ్య సూర్యాపేట నుంచి వేసుకుని వచ్చిన టీఎస్‌. 29 బి 9495 నెంబరు కారు కొణకంచి క్రాస్‌ రోడ్డు వద్ద ఒక కర్మాగారం వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 2న హైదరాబాద్‌కు చెందిన మాజీ నక్సలైట్‌ తాడూరి శ్రీకాంతాచారి (35)ను జగ్గయ్యపేటలో అరెస్టు చూపించారు.

పోలీసులను తప్పుదోవ పట్టించేలా..

రియల్‌ ఎస్టేట్‌ లావాదేవిల్లో వచ్చిన వివాదాల్లో తనను చంపేస్తానని ఎల్లయ్య బెదిరించటంతో అన్నంత పనిచేసే పట్టుదల ఉన్న ఎల్లయ్యను అడ్డు తొలగించుకోవాలని హత్య చేసినట్టు ప్రధాన నిందితుడు శ్రీకాంతాచారి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. నల్గొండకు చెందిన అతడికి ఎల్లయ్యకు అనేక వివాదాలు వచ్చినట్టు చెప్పారు. జగ్గయ్యపేటలో హత్య చేసి ఎల్లయ్య శవాన్ని చేపలు పార్సిల్‌ చేసే బాక్సులో వేసి చిల్లకల్లు వద్ద టోల్‌గేట్‌ తగలకుండా మరో మార్గంలో తరలించి వైజాగ్‌కు వెళ్లే వాహనంలో పంపించేశామని, అక్కడ తన మనిషి సముద్రంలో కలిపేశారని పోలీసులను తప్పుదోవ పట్టించారు. హత్యలో తనతోపాటు వచ్చిన ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు ఉన్నారని పేర్కొన్నట్టు పోలీసులు చెప్పారు. హతుడు శవం దొరకకుండా చేస్తే ఈ కేసులో సులువుగా తప్పించుకోవచ్చన ఆలోచనతో పోలీసులను ఉద్దేశ్యపూరకంగా తప్పుదోవ పట్టించారు. అతనితో పాటు హత్యలో పాల్గొన్నట్టు అనుమానిస్తున్న వ్యకి ్త ఇచ్చిన సమాచారం, బండిపాలెం గ్రామస్థుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయటంతో ఎల్లయ్య మృతదేహం బయటపడింది. 20 రోజులు రెండు రాష్ట్రాల పోలీసులకు కంటికి కునుకు లేకుండా చేసిన ఎల్లయ్య హత్యకేసులో మిస్టరీ వీడినట్టు అయింది. ఎల్లయ్య భౌతికకాయాన్ని బంధువులు గుర్తించటంతో పోలీ సులు ఊపిరి పీల్చుకున్నారు. హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న వ్యక్తుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. జగ్గయ్యపేట సీఐ జయరాం మా ట్లాడుతు త్వరలో కేసులో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకుంటామని చెప్పారు.

Updated Date - May 09 , 2024 | 01:14 AM