Share News

వైద్యుల రక్షణకు చట్టం తేవాలి

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:21 AM

వైద్యులు, ఆస్పత్రులపై దాడుల నుంచి రక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) డిమాండ్‌ చేసింది.

వైద్యుల రక్షణకు చట్టం తేవాలి
మాట్లాడుతున్న ఐఎంఏ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ పోలవరపు ఫణిధర్‌

గవర్నర్‌పేట, జూలై 26: వైద్యులు, ఆస్పత్రులపై దాడుల నుంచి రక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) డిమాండ్‌ చేసింది. శుక్రవారం ఏలూరు రోడ్డులోని ఐఎంఏ హాలులో మీడియా సమావేశంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.జయచంద్రనాయుడు, జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ పోలవరపు ఫణిధర్‌ మాట్లాడారు. వైద్యులు వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడంలో అనేక కష్టాలు ఎదు ర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య వృత్తిని నేరాల పరిధి నుంచి తప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్యులపై దాడుల నిరోధానికి కేంద్రం చట్టం చేసేలా పార్లమెంటు సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. వైద్య చికిత్స సమయంలో మరణాలు హత్యల కిందకు రావని, వైద్యంలో నిర్లక్ష్యం అనేది నేరం కాదని వారు పేర్కొన్నారు. న్యాయం కోసం వైద్యుల ప్రచార ఉద్యమాన్ని ఐఎంఏ చేపట్టిందన్నారు. ఐఎంఏ నేతలు డాక్టర్‌ ఎంఏ రహమాన్‌, డాక్టర్‌ ఎస్‌.దినేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 01:21 AM