Share News

లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపరాదు

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:46 AM

లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపరాదని, అందు కు చట్టపరంగా జరిమానా ఉంటుందని పట్టణ ఎస్సై గణేశ్‌కుమార్‌ హెచ్చరిం చారు. కళాశాల రోడ్డులో లైసెన్స్‌ లేకుండా ద్విచక్రవాహనాలు నడుపుతూ పట్టు బడ్డ యువకులకు శుక్రవారం కౌన్సెలింగ్‌ ఇచ్చి జరిమానా విధించారు.

 లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపరాదు
యువకులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న ఉయ్యూరు పట్టణ ఎస్సై గణేశ్‌కుమార్‌

ఉయ్యూరు, జూలై 26 : లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపరాదని, అందు కు చట్టపరంగా జరిమానా ఉంటుందని పట్టణ ఎస్సై గణేశ్‌కుమార్‌ హెచ్చరిం చారు. కళాశాల రోడ్డులో లైసెన్స్‌ లేకుండా ద్విచక్రవాహనాలు నడుపుతూ పట్టు బడ్డ యువకులకు శుక్రవారం కౌన్సెలింగ్‌ ఇచ్చి జరిమానా విధించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నపడరాదని, ప్రమాదాలు జరిగినప్పుడు చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. మద్యం, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం నేరమని, వాటికి యువత దూరంగా ఉండాలన్నారు. లైసెన్స్‌ లేకుండా వాహనం నడుపుతూ రెండవ సారి పట్టుబడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Updated Date - Jul 27 , 2024 | 12:46 AM