Share News

మహాదానం నేత్రదానం : డాక్టర్‌ సమరం

ABN , Publish Date - May 09 , 2024 | 12:31 AM

నేత్రదానం సర్వోన్నతమైనదని, నేత్రదానం ద్వారా మరొకరికి కంటి వెలుగును ఇవ్వవచ్చునని రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ సమరం అన్నారు.

మహాదానం నేత్రదానం : డాక్టర్‌  సమరం
మాట్లాడుతున్న డాక్టర్‌ సమరం

మహాదానం నేత్రదానం : డాక్టర్‌ సమరం

వన్‌టౌన్‌, మే 8: నేత్రదానం సర్వోన్నతమైనదని, నేత్రదానం ద్వారా మరొకరికి కంటి వెలుగును ఇవ్వవచ్చునని రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ సమరం అన్నారు. బుధవారం కొత్తపేటలోని కేబీఎన్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ ఎస్‌విభాగాల ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నేత్రదానం మహాదానమని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. మూఢనమ్మకాలు, గుడ్డి విశ్వాసాల కారణంగా అవయవదానం చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. మనం మరణించిన తరువాత కళ్లను దానం చేయడం ద్వారా ఎంతోమంది అంధులకు చూపు ప్రసాదించవచ్చునని చెప్పారు. అవయవదానాన్ని ప్రోత్సహించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు అధ్యక్షత వహించారు. ప్రాజెక్ట్‌ అధికారులు డి.పవన్‌కుమార్‌, ఎన్‌.సాంబశివరావు, శాంతిబాబు, కల్మబేగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:31 AM