Share News

AP News: వల్లభనేని వంశీ అరెస్ట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన పోలీసులు

ABN , Publish Date - Aug 02 , 2024 | 06:43 PM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టయ్యారంటూ వచ్చిన వార్తలపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. వంశీని అరెస్ట్ చేయలేదని, అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

AP News: వల్లభనేని వంశీ అరెస్ట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన పోలీసులు

అమరావతి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టయ్యారంటూ వచ్చిన వార్తలపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. వంశీని అరెస్ట్ చేయలేదని, అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్‍ పఠాన్‌ను అరెస్ట్ చేశామని వివరించారు. యూసఫ్ పఠాన్ ఉన్న కారులోనే వంశీ ఉన్నట్లు ప్రచారం జరిగిందని, ఆయన ఇంకా దొరకలేదని పోలీసులు అంటున్నారు. మరో అనుచరుడు రమేశ్‌ని నిన్న (గురువారం) రాత్రి అరెస్ట్ చేశామన్నారు. వంశీ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని, హైదరాబాద్, గన్నవరం సహా పలు ప్రాంతాల్లో వంశీ కోసం గాలిస్తున్నట్టు వివరించారు.

కాగా వల్లభనేని వంశీని ( Vallabhaneni Vamsi) పోలీసులు అరెస్ట్ చేశారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గన్నవరం దగ్గరలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని, పోలీస్ స్టేషన్‌కు తరలించారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇవ్వన్నీ ఉత్తదేనని తేలిపోయింది.

గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వల్లభనేని వంశీ ఏ71గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో చాలా మంది దాడికి ప్రోద్బలం ఇచ్చింది వల్లభనేని వంశీయేనని వాంగ్మూలం ఇచ్చారు. దీంతో వంశీని కూడా అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తు్న్నారు.

Updated Date - Aug 02 , 2024 | 06:52 PM