Share News

రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - May 19 , 2024 | 12:27 AM

ఎన్నికల ప్రక్రియ ముగి సేంత వరకూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేయకూడదంటూ వీరవల్లి పోలీసు లు టీడీపీ నాయకులకు శనివారం సెక్షన్‌ 149 సీఆర్పీసీ నోటీసు జారీ చేశారు. రంగన్నగూడెంలో ఆళ్ల గోపాలకృష్ణకు, టీడీపీ మండల అధ్యక్షుడు దయా ల రాజేశ్వరరావు, తదితర టీడీపీ నాయకులతో పాటు వైసీపీ నాయకులు, మొత్తం 10 మందికి వీరవల్లి పోలీసులు నోటీసు లు జారీ చేశారు.

 రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తే కఠిన చర్యలు
టీడీపీ నేత ఆళ్ల గోపాలకృష్ణకు నోటీసు అందజేస్తున్న పోలీసులు

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, మే 18 : ఎన్నికల ప్రక్రియ ముగి సేంత వరకూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేయకూడదంటూ వీరవల్లి పోలీసు లు టీడీపీ నాయకులకు శనివారం సెక్షన్‌ 149 సీఆర్పీసీ నోటీసు జారీ చేశారు. రంగన్నగూడెంలో ఆళ్ల గోపాలకృష్ణకు, టీడీపీ మండల అధ్యక్షుడు దయా ల రాజేశ్వరరావు, తదితర టీడీపీ నాయకులతో పాటు వైసీపీ నాయకులు, మొత్తం 10 మందికి వీరవల్లి పోలీసులు నోటీసు లు జారీ చేశారు. అమలులో ఉన్న ఎన్నికల నియమావళిని ఉల్లఘించరాదని నోటీసులో పేర్కొన్నారు. ప్రస్తుతం సున్నిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజాజీవితానికి భంగం కలిగేలా ఉద్రిక్తత లను, విపక్షం వారిని రెచ్చగొట్టే విధంగా బహిరంగ వాఖ్యలు చేసినా, ప్రెస్‌మీట్‌లు పెట్టినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్సై చిరంజీవి హెచ్చరించారు.

Updated Date - May 19 , 2024 | 12:27 AM