Share News

పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:17 AM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ అన్నారు.

పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
గుడివాడ ఏరియా ఆస్పత్రిలో తనిఖీలు చేస్తున్న వాకాటి కరుణ

వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ

గుడివాడ/గుడ్లవల్లేరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ అన్నారు. బుధవారం గుడివాడ ఏరియా ప్రభుత్వాస్పత్రి, గుడ్లవల్లేరు ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఏరియా ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి పలు సూచనలు చేశా రు. బ్లడ్‌ బ్యాంక్‌, ఆపరేషన్‌ థియేటర్లను సందర్శించారు. రోగులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఆమె వెంట ఆసుపత్రి సూపరిటెండెంట్‌ డాక్టర్‌ ఇందిరాదేవి ఉన్నారు. గుడ్లవల్లేరులో ఎన్‌సీ డీ సీడీ సర్వే, ఆర్‌బీఎస్‌కే సర్వేలను వేగవంతంగా, నాణ్యతగా నిర్వ హించాలని సూచించారు. పీహెచ్‌సీలో లాబ్‌లను, రికార్డులను ఆమె పరిశీలించారు. డీఎంహెచ్‌వో గీతాబాయ్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి గోపాల్‌ నాయక్‌, డాక్టర్‌ యశశ్విని పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 01:17 AM