Share News

కూటమి, వైసీపీల్లో అధికారమెవరిదైనా బీజేపీకొచ్చిన నష్టమేమీ లేదు

ABN , Publish Date - May 08 , 2024 | 01:01 AM

రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి, వైసీపీల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా బీజేపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని, చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి ఇద్ద రిపై కేసులున్న కారణంగా మోదీ చేతిలో కీలుబొమ్మలుగా మారతారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శిం చారు.

కూటమి, వైసీపీల్లో అధికారమెవరిదైనా బీజేపీకొచ్చిన నష్టమేమీ లేదు
మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

చంద్రబాబు, జగన్‌..మోదీ చేతిలో కీలుబొమ్మలు

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇండియా కూటమిని గెలిపించండి: సీపీఐ నేత కె.నారాయణ

భవానీపురం, మే 7: రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి, వైసీపీల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా బీజేపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని, చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి ఇద్ద రిపై కేసులున్న కారణంగా మోదీ చేతిలో కీలుబొమ్మలుగా మారతారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శిం చారు. ఇండియా కూటమి బలపర్చిన సీపీఐ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి జి.కోటేశ్వరరావు ఎన్నికల ప్రచా రంలో భాగంగా మంగళవారం నిర్వహించిన స్కూటల్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అధికారం కోసం బీజెపీ ఎంత కైనా తెగిస్తుందని, మహారాష్ట్రలో ప్రజలు ఎన్నుకున్న ప్రభు త్వాన్ని కూల్చి తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని నారాయణ అన్నారు. లౌకిక ప్రజాస్వామ్య పరి రక్ష ణకు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలం గాణలో ప్రభుత్వాల్ని బీజేపీ కూల్చేస్తుందని ఆయన హెచ్చ రించారు. ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తాననడం రాజ్యాంగ విరుద్దమన్నారు. తనను ఎమ్మెల్యేగా, వల్లూరి భార ్గవ్‌ను ఎంపీగా గెలిపించాలని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి కోటే శ్వరరావు ప్రజలను కోరారు. భవానీపురం దర్గా వద్ద ప్రారం భమైన ర్యాలీ స్వాతి థియేటర్‌రోడ్డు, ఊర్మిళానగర్‌, ఆర్టీసీ వర్క్‌షాపు, కుమ్మరిపాలెం, చెరువు సెంటర్‌, సితార సెంటర్‌, ఎర్రకట్ట బ్రిడ్జి, చిట్టినగర్‌, పంజా సెంటర్‌, పెజ్జోనిపేట వరకు సాగింది. కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నర సింహారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, దోనేపూడి శంకర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్య క్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌, సీపీఎం నాయకులు బోయి సత్తి బాబు, సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శివర్గ సభ్యులు కేవీ భాస్కరరావు, తాడి పైడయ్య, మూలి సాంబశివరావు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 01:02 AM