Share News

AP News: లే నాన్నా.. ఒళ్లు అంతా చల్లబడిపోయిందిరా.. మూడు కుటుంబాల్లో విషాదం నింపిన ఘటన

ABN , Publish Date - Jan 29 , 2024 | 07:18 AM

విజయవాడ: కృష్ణానదిలో దిగి ముగ్గురు విద్యార్థులు ‌మృతి చెందారు. అయితే మృతదేహాలను తరలింపుకు పోలీసులు ముందుకు రాలేదు. పరిధిలు పేరుతో పట్టించుకోక పోవడంతో విద్యార్థులు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP News: లే నాన్నా.. ఒళ్లు అంతా చల్లబడిపోయిందిరా.. మూడు కుటుంబాల్లో విషాదం నింపిన ఘటన

విజయవాడ: కృష్ణానదిలో దిగి ముగ్గురు విద్యార్థులు ‌మృతి చెందారు. అయితే మృతదేహాలను తరలింపుకు పోలీసులు ముందుకు రాలేదు. పరిధిలు పేరుతో పట్టించుకోక పోవడంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నది వద్ద నుంచి మృతదేహాలను కుటుంబ సభ్యులు బైక్‌ల‌ మీదే బయటకి తీసుకువచ్చారు. అక్కడకి కూడా అంబులెన్స్ రాకపోవడంతో మళ్లీ యనమల కట్ట రోడ్ వరకు బిడ్డల మృతదేహాలను కుటుంబ సభ్యులే తరలించుకున్నారు. కట్ట ప్రధాన రోడ్ మీదకు కూడా అంబులెన్స్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో అంబులెన్స్ రప్పించడంతో మృతదేహాలను మార్చురీకి తరలించారు.

ఈ ఘటన గుంటూరు జిల్లా, తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానదిలో చోటు చేసుకుంది . సరదాగా స్నానానికి నదిలో దిగడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పటమటకు చెందిన నడుపల్లి నాగ సాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్, గగన్ గా గుర్తించారు. కాగా నదిలో స్నానానికి నలుగురు వెళ్లగా.. ఒకరు ప్రాణాలతో బయటపడగా.. ముగ్గురు మృతి చెందారు.

Updated Date - Jan 29 , 2024 | 12:19 PM