Share News

నీటికుంటలో పడి ఇద్దరు బాలికలు మృతి

ABN , Publish Date - May 09 , 2024 | 01:05 AM

పరిటాల శివారు దొనబండ రాతిక్వారీ వద్ద ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఎస్సై సుబ్రహ్మణ్యం కథనం ప్రకారం రాతిక్వారీలో పని చేసుకుని జీవించే లివన్‌జానీ-సావిత్రికి నలుగురు పిల్లలు. వారిలో ముగ్గురు పాపలు, ఒక బాబు. వీరిలో లక్ష్మీజానీ (13), రాధాజానీ (12) బుధవారం ఉదయం క్వారీ నీటి కుంటలో బట్టలు ఉతికేందుకు వెళ్లారు.

నీటికుంటలో పడి ఇద్దరు బాలికలు మృతి

నీటికుంటలో పడి ఇద్దరు బాలికలు మృతి

దొనబండ రాతిక్వారీ వద్ద ఘటన

మృతులిద్దరూ అక్కాచెల్లెలు

బట్టలు ఉతికేందుకు వెళ్లి దుర్మరణం

కంచికచర్ల రూరల్‌, మే 8 : పరిటాల శివారు దొనబండ రాతిక్వారీ వద్ద ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఎస్సై సుబ్రహ్మణ్యం కథనం ప్రకారం రాతిక్వారీలో పని చేసుకుని జీవించే లివన్‌జానీ-సావిత్రికి నలుగురు పిల్లలు. వారిలో ముగ్గురు పాపలు, ఒక బాబు. వీరిలో లక్ష్మీజానీ (13), రాధాజానీ (12) బుధవారం ఉదయం క్వారీ నీటి కుంటలో బట్టలు ఉతికేందుకు వెళ్లారు. వారిలో ఒకరు ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయారు. కాపాడేందుకు మరొకరు ప్రయత్నించడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. వారితో పాటు తోడు వెళ్లిన బంధువుల పిల్లాడు చంటి ఇంటికి వెళ్లి సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన బంధువులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే బాలికలిద్దరూ మృతిచెందారు. లక్ష్మీజానీ తొమ్మిదో తరగతి, రాధాజానీ ఎనిమిదో తరగతి పూర్తిచేశారు. వేసవి సెలవులకు ఇంటి వద్దే తల్లిదండ్రులతో ఉంటున్నారు. ఒడిశాకు చెందిన ఈ కుటుంబం 30 ఏళ్ల క్రితమే దొనబండకు వచ్చి క్వారీల్లో కూలి చేసుకుంటూ జీవిస్తోంది. కష్టపడి పనిచేసుకుంటూ ఇద్దరి పిల్లలను చదివించుకుంటున్నామని, కాలం ఇలా ఒకేసారి ఇద్దరినీ తమ నుంచి దూరం చేసిందని తల్లిదండ్రులు బోరుమన్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నీటికుంటలో ఉన్న ఇద్దరు బాలికల మృతదేహాలను బయటకు తీయించి, పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాసుపత్రికి పంపి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 09 , 2024 | 01:05 AM