Share News

అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:19 AM

ఇసుకను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ (ఎక్సైజ్‌) శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు
వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్‌, అధికారులు

కర్నూలు(కలెక్టరేట్‌), జూలై 26: ఇసుకను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ (ఎక్సైజ్‌) శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. విజయవాడ నుంచి ఇసుక ఆపరేషన్స్‌పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. ఈ సందర్భంగా రెవెన్యూ (ఎక్సైజ్‌)శాఖ ముఖ్య కార్యదర్శి మాట్లా డుతూ ఆరు నుంచి 8 నెలలకు ఇసుకను సరఫరా చేసేలా ప్లాన్‌ చేయడం తోపాటు ప్రస్తుతం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొత్తగా ఇసుక రీచ్‌లను గుర్తించాలన్నారు. ఇసుక రవాణాకు సంబంధించి వాహన యజమానులు ఎక్కువ ధర వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టాక్‌ పాయింట్ల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండేలా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా సంబంధిత అధికారులతో మాట్లా డు తూ జిల్లా స్థాయి ఇసుక కమిటీలోని అధికారులందరూ ప్రతి వారం ఇసుక రీచ్‌లను పరిశీలించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సెబ్‌ సూపరిం టెండెంట్‌ వినోద్‌ కుమార్‌, డీఆర్వో మధుసూదన్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:19 AM