Share News

కోడుమూరులో చైన్‌ స్నాచింగ్‌కు యత్నం

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:44 AM

కోడుమూరులో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మహిళ ఉపాధ్యాయురాలి మెడలోని గొలుసును లాగేసుకున్నారు.

కోడుమూరులో చైన్‌ స్నాచింగ్‌కు యత్నం
బాధితురాలిని విచారిస్తున్న ఎస్‌ఐ ఏపీ శ్రీనివాసులు

పోలీసులకు దొరికిన గొలుసు

దొంగల కోసం గాలింపు

కోడుమూరు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): కోడుమూరులో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మహిళ ఉపాధ్యాయురాలి మెడలోని గొలుసును లాగేసుకున్నారు. అయితే తప్పించుకుని వెళ్లే ప్రయత్నంలో బంగారు గొలుసును అక్కడే పడేసి బైక్‌పై వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన ఎస్‌ఐ ఏపీ శ్రీనివాసులు తెలిపిన వివరాలు మేరకు కోడుమూరులో నివా సం ఉంటున్న అనసూయ అనే మహిళ ఉపాధ్యాయురాలు గణేష్‌ నగర్‌ ప్రాంతంలో మైదానంలో సాయంత్రం వాకింగ్‌ చేస్తుండగా టీవీఎస్‌ స్టోర్స్‌ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ముఖానికి ముసుగు వేసుకొని మైదానానికి చేరుకున్నారు. పథకం ప్రకారం ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కున్నారు. బాధితురాలు వెంటనే కేకలు వేయడంతో ఆ ప్రాంతంలో వాకింగ్‌ చేస్తున్న కొంత మంది దొంగలను వెంబడించే ప్రయత్నం చేశారు. దీంతో దొంగలు లాక్కున్న గొలుసును చెట్లల్లో పడేసి వెళ్లిపోయారు. బాఽధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తన సిబ్బందితో గొలుసు కోసం వెతకగా చెట్ల పొదల్లో దొరికింది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలు చెప్పిన వివరాల మేరకు నిందితులను గుర్తించి త్వరలో పట్టుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Nov 21 , 2024 | 12:44 AM