Share News

ప్రతిదాడులు తప్పవు.. జాగ్రత్త

ABN , Publish Date - May 09 , 2024 | 12:43 AM

వైసీపీ గుండాలు, రౌడీలు టీడీపీ కార్యకర్తలపై దాడులు ఆపకపోతే ప్రతి దాడులు తప్పవని టీడీపీ జిల్లా ఆధ్యక్షుడు తిక్కారెడ్డి హెచ్చరించారు.

ప్రతిదాడులు తప్పవు.. జాగ్రత్త

అధికారులు వైసీపీ ముసుగులు తీసేయాలి

వైసీపీ గూండాలకు ఊడిగం చేయకండి

అలాంటి అధికారుల జాబితా లోకేశ్‌ సిద్ధం చేయమన్నారు

ప్రశాంతంగా పోలింగ్‌ జరపాలని ఎన్నికల కమిషన్‌ను కోరతాం

టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

కర్నూలు(అర్బన్‌), మే 8: వైసీపీ గుండాలు, రౌడీలు టీడీపీ కార్యకర్తలపై దాడులు ఆపకపోతే ప్రతి దాడులు తప్పవని టీడీపీ జిల్లా ఆధ్యక్షుడు తిక్కారెడ్డి హెచ్చరించారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆలూరు, కోడుమూరుల్లో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపైన భౌతిక దాడులకు దిగుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యా పద్ధతి కాదని అన్నారు. వైసీపీ దాడులు పునరావృతం అయితే ప్రతి దాడులకు కర్రలు పట్టుకొని తమ కార్యకర్తలు ప్రజాస్యామ్యాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉంటారని హెచ్చరించారు. దాడులు చేస్తే అధికారులు చిన్న కేసులతో సరిపెడుతున్నారని, దీంతో నిందితులు క్షణాల్లో బయటకు వచ్చి దాడులకు తెగబడుతున్నారని, వారికి సహకరిస్తున్న అధికారులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. కర్నూలు, కోడుమూరు, ఆలూరుల్లో వైసీపీ ముసుగు వేసుకుని పని చేస్తున్న అధికారుల జాబితా సిద్ధం చేయాలని జాతీయ కార్యదర్శి లోకేష్‌ సూచించారని అన్నారు. వారు ఏ జిల్లాకు బదిలీపై వెళ్లినా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక వారిని రప్పించి శిక్షిస్తామని అన్నారు. అందుకు వారు సిద్ధంగా ఉండాలని అన్నారు. అధికారులు వైసీపీ ముసుగులు తీసి పని చేయాలని అన్నారు. ఆలూరు మండలంలోని మణెకుర్తి, అంగనగళ్లు గ్రామంలో వెసీపీకి చెందిన 30 నుంచి 35 మంది దాడులు చేస్తోంటే పోలీసులు నివారించకుండా వారికి అండగా నిలిచారని ఆరోపిం చారు. ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉండటంతో ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలో వైసీపీ నాయకు లకు ఓటమి భయం పట్టుకుని దాడులకు తెగబడు తున్నారన్నారు. బనగానపల్లెలో ఎమ్మెల్యే భార్య దగ్గరుండి దాడులు చేయించడం దారుణమన్నారు. ఎంపీ సంజీవకుమార్‌ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల వారిని దాడులకు ఉసిగొల్పి వారి చుట్టూ తిప్పుకుంటూ కేసులలో ఇరికించేందుకు పావులుగా వాడుకుంటున్నారని అన్నారు. దాడులకు పాల్పడిన వారు, దాడికి గురైన వారు కూడా బడుగులేనని, వైసీపీ కుట్రలు, మాయలో పడద్దని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇప్పటికే ఓటమి భయం పట్టుకున్న జగన్‌ ఇలా దాడులకు ఉసిగొల్పుతున్నారని, ఇలాగే 13వ తేదీన అక్రమాలకు పాల్పడేందుకు డబ్బు, మద్యం, రౌడీలను సిద్ధం చేసుకుంటు న్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నంద్యాల నాగేంద్ర, కేయి జగదీష్‌, బీ. సంజీవలక్ష్మి, పి.హనుమంతరావు చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:43 AM