Share News

ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్‌

ABN , Publish Date - May 09 , 2024 | 12:46 AM

బాధ్యత గల పౌరులుగా 18 సంవత్సరాలు నిండిని ప్రతి ఒక్కరూ పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు సూచించారు.

ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్‌
స్వీప్‌ టోపీలను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌

నంద్యాల (కల్చరల్‌), మే 8: బాధ్యత గల పౌరులుగా 18 సంవత్సరాలు నిండిని ప్రతి ఒక్కరూ పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు సూచించారు. బుధవారం ఆయన చాంబర్‌లో స్వీప్‌ యాక్టివిటీ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై టోపీలను ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న ఎన్నికల్లో తమకు నచ్చిన వారికి ఓటువేసి జిల్లాలో ఓటింగ్‌ శాతం పెంచాలని కలెక్టర్‌ కోరారు. 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి మన రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని ... ఈ మేరకు జిల్లాలో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు వివిధ రూపాల్లో స్వీప్‌ యాక్టివిటీస్‌ ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - May 09 , 2024 | 12:46 AM