Share News

Nandyala: శ్రీశైలం రిజర్వాయర్‌లో చేపల మృత్యువాత

ABN , Publish Date - Jan 27 , 2024 | 08:09 AM

నంద్యాల జిల్లా: శ్రీశైలం రిజర్వాయర్‌లో చేపలు మృత్యువాత పడ్డాయి. శ్రీశైలం డ్యామ్ ముందు భాగంలోని పెద్ద బ్రిడ్జ్ పక్కన గేజింగ్ మడుగులో కుప్పలు తెప్పలుగా భారీగా చేపలు మృతి చెందాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లోని ముందు బాగంలో వాటర్ రంగు మారింది.

Nandyala: శ్రీశైలం రిజర్వాయర్‌లో చేపల మృత్యువాత

నంద్యాల జిల్లా: శ్రీశైలం రిజర్వాయర్‌లో చేపలు మృత్యువాత పడ్డాయి. శ్రీశైలం డ్యామ్ ముందు భాగంలోని పెద్ద బ్రిడ్జ్ పక్కన గేజింగ్ మడుగులో కుప్పలు తెప్పలుగా భారీగా చేపలు మృతి చెందాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లోని ముందు బాగంలో వాటర్ రంగు మారింది. లింగాలగట్టు సమీపంలోని రిజర్వాయర్‌లో చేపలు చనిపోవడంతో మత్స్యకారులు, స్దానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గత ఐదు రోజులుగా చేపలు చనిపోతున్నాయని లింగాలగట్టు గ్రామస్థులు చెబుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో మత్స్య సంపదకు భారీగా నష్టం వాటిల్లింది. చేపలు చనిపోవడంతో మత్స్యకారులు లబోదిబోమంటున్నారు.

Updated Date - Jan 27 , 2024 | 08:10 AM