Share News

రైతులను దగా చేసిన ప్రభుత్వం: బీసీ ఇందిరమ్మ

ABN , Publish Date - May 09 , 2024 | 12:44 AM

రైతులకు సాగునీరు అందించకుండా వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని తెలుగు మహిళ నాయకురాలు బీసీ ఇందిరమ్మ విమర్శించారు.

రైతులను దగా చేసిన ప్రభుత్వం: బీసీ ఇందిరమ్మ

సంజామల, మే 8: రైతులకు సాగునీరు అందించకుండా వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని తెలుగు మహిళ నాయకురాలు బీసీ ఇందిరమ్మ విమర్శించారు. బుధవారం సంజామల మండలంలోని ముదిగేడు, ఆల్వ కొండ, గ్రామాల్లో బీసీ ఇందిరమ్మ ప్రజాగళం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నిబంధనల పేరుతో సం క్షేమ పథకాలకు తూట్లు పొడిచిందని విమర్శించారు. ముదిగేడు గ్రామంలో పొలాలకు గ్రావెల్‌ వేయిస్తామని వైసీపీ నాయకులు చెప్పి మాట తప్పార న్నారు. పైప్‌లైన్‌ వేసి నీటి సమస్యను తీరుస్తామని చెప్పి నీటి సమస్య తీర్చలే దన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించక ఇబ్బందులకు గురి చేసిందన్నారు. టీడీపీ హయంలో బీసీ జనార్దన్‌రెడ్డి సకాలంలో రైతులకు సాగు, తాగునీరు అందించి ఆదుకున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. పైప్‌లైన్‌ వేసి నీటి కష్లాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఆల్వకొండ గ్రామంలో కొం డను వైసీపీ నాయకులు అమ్ముకొని దోపిడీ చేశారని విమర్శించారు. ఇంటి పట్టాలు కావాలంటే వైసీపీ పాలనలో కమీషన్లు ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వాటర్‌ప్లాంట్‌ నిర్వహణ సరిగాలేక దుర్వాసన వస్తున్నదని అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిరెడ్డి విష్ణుశేఖర్‌రెడ్డి, తిమ్మయ్య, పుల్లారెడ్డి, హుసేని, మూసాని చంద్రశేఖరెడ్డి, పెరుగు శ్రీనివాసులు, బండి జనార్దన్‌రెడ్డి, ముడి యం రాజగోపాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, రామిరెడ్డి, పసుపుల మహమ్మద్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:44 AM