Share News

అప్రోచ్‌ రోడ్డు లేని గ్రామాలను గుర్తించండి

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:24 PM

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రోచ్‌ రోడ్డు లేని గ్రామాలను గుర్తించాలని కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను ఆదేశించారు.

అప్రోచ్‌ రోడ్డు లేని గ్రామాలను గుర్తించండి

కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా

కర్నూలు(కలెక్టరేట్‌), జూలై 26: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రోచ్‌ రోడ్డు లేని గ్రామాలను గుర్తించాలని కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అధికారులతో రోడ్ల నిర్మాణంపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రెండు కి.మీ లోపు అప్రోచ్‌ రోడ్డు వేయని గ్రామాలకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద రోడ్లను నిర్మిస్తామని తెలిపారు. ఆర్‌అండ్‌బీ కింద గుంతలు ఉన్న 39 రోడ్లకు మరమ్మతులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా పథకాల కింద చేయాల్సిన పనులను ఐడెంటిఫై చేసి వెంటనే ప్రతిపాదనలు పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నాగరాజు, ఈఈ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:24 PM