Share News

గర్భిణి అడ్మిషన్‌లో నిర్లక్ష్యంపై విచారణ

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:14 AM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గైనిక్‌ విభాగంలో ఓ నిండు గర్భిణి అడ్మిషన్‌లో నిర్లక్ష్యంపై శుక్రవా రం ధన్వంతరీ హాలులో నిజనిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.

గర్భిణి అడ్మిషన్‌లో నిర్లక్ష్యంపై విచారణ

కర్నూలు(హాస్పిటల్‌), జూలై 26: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గైనిక్‌ విభాగంలో ఓ నిండు గర్భిణి అడ్మిషన్‌లో నిర్లక్ష్యంపై శుక్రవా రం ధన్వంతరీ హాలులో నిజనిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. దేవనకొండకు చెందిన శశికళ అనే గర్భిణి అడ్మిషన్‌ విషయంలో వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో ఆమె కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) విచారణకు ఆదేశించింది. ఈ మేరకు కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా.చిట్టి నరసమ్మ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.సి.ప్రభాకర్‌ రెడ్డి, మెడి సిన్‌ హెచ్‌వోడీ డా.ఇక్బాల్‌ హుశేన్‌లు శుక్రవారం విచారణ చేపట్టారు. అనం తరం గైనిక్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, పీజీలతో కలిసి గర్భిణి ఓపీ టికెట్‌ చించి వేయడం, అడ్మిషన్‌ చేయడంలో ఆలస్యంపై విచారించారు. గర్భిణి తల్లితో మాట్లాడగా ఉదయం వచ్చినా ఆసుపత్రిలో చేర్చుకోకుండా వైద్యులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, సాయంత్రం అవు తున్నా స్పందించకపోవడంతో తాము కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాల్సి వచ్చిం దని తెలిపారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.సి.ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ గైనిక్‌తో పాటు ఇతర అత్యవసర వార్డులకు వచ్చే రోగుల పట్ల మర్యాదగా మాట్లాడాలని అన్నారు. రోగుల ప్రాణాలను కాపాడే బాధ్యత వైద్యులదేనని, ఆ విషయం మరిచి ప్రవర్తించ వద్దని సూచించారు. సమా వేశంలో గైనిక్‌ విభాగపు హెచ్‌వోడీ డాక్టర్‌ శ్రీలక్ష్మి, ప్రొఫెసర్‌ సావిత్రి, డిప్యూ టీ సీఎస్‌ఆర్‌ఎంవో హేమనళిని, ఏఆర్‌ఎంవో వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:14 AM